గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించాడు..ఈ సినిమాను జనవరి 10 2025 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..మరో 10 రోజుల్లో ఈ బిగ్గెస్ట్ సినిమా థియేటర్లలోకి రాబోతుంది..మొన్నటీ వరకు పుష్ప క్రేజ్ పీక్స్ లో వుంది..ఇప్పుడిప్పుడే ‘పుష్ప’ మేనియా తగ్గి, ‘గేమ్ ఛేంజర్’ హడావుడి కనిపిస్తోంది.దీనితో ”గేమ్ ఛేంజర్” మేకర్స్ ప్రమోషన్స్ లో జోరు పెంచారు.
“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?
ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన రామ్ చరణ్ కటౌట్ లాంచ్ ఈవెంట్లో దిల్ రాజు జనవరి 1న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నామని అప్డేట్ ఇచ్చారు…దీనితో న్యూ ఇయర్ గిఫ్ట్ అదిరిందని ఫ్యాన్స్ సంతోష పడ్డారు..కానీ అంతలోనే సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ డేట్ మారబోతుందని బ్యాడ్ న్యూస్ వైరల్ అవుతుంది..అయితే ఈ సినిమా ట్రైలర్ ని సింపుల్ గా రిలీజ్ చేయకుండా హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పెరేడ్ గ్రౌండ్స్ లో ఓ భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేస్తున్నట్లుగా ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని ప్రచారం నడిచింది.
కానీ తాజా సమాచారం ప్రకారం ‘గేమ్ ఛేంజర్’ట్రైలర్ రిలీజ్ ను జనవరి 1న కాకుండా 2వ తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ నడుస్తోంది. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి సంబంధించిన ఫైనల్ మిక్సింగ్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం.అయితే ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా స్పందించలేదు.