గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘’ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు..ఈ సినిమా ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద హైప్ మరింత పెరిగింది. శంకర్ గతంలో రూపొందించిన ‘జెంటిల్మన్’, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాల తరహాలో గేమ్ ఛేంజర్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సినిమా కథలో రెండు ప్రధాన ట్విస్టులు ఉంటాయని సమాచారం…
గేమ్ ఛేంజర్ : మాస్ జాతర సాంగ్ “కొండ దేవర”వచ్చేసింది..!!
ఈ ట్విస్టులు ప్రేక్షకులు స్టన్ అయేలా ఉంటాయని సమాచారం.మొదటి ట్విస్ట్ ఇంటర్వెల్ సమయంలో ఉంటుందని, అది యాక్షన్ బ్లాక్ ద్వారా అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం. ఈ సీన్ సెకండ్ హాఫ్ కి మరింత లీడింగ్ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, రెండవ ట్విస్ట్ ప్రీ క్లైమాక్స్‌లో ఉంటుందని సమాచారం..ఈ సినిమా బిగ్గెస్ట్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో రానుందని తెలుస్తుంది..ఈ రెండు ట్విస్ట్ లు సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని సమాచారం..
ఈ సినిమాలో చరణ్ పెర్ఫెమెన్స్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రామ్ చరణ్, ఎస్ జె సూర్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కుంటాయని మేకర్స్ ధీమాగా వున్నారు..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ మరో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో ఎస్. జె. సూర్య, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు..