MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : శంకర్ డైరెక్షన్ కి అగ్ని పరీక్ష.. పూర్వ వైభవం చూపిస్తాడా..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ బిగ్గెస్ట్ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటించారు.. అలాగే ఎస్ జే సూర్య, శ్రీకాంత్, జయరాం వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈనెల 10వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకోగా సినిమా బాగుందంటూ సెన్సార్ సభ్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది.

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో మరో సర్ప్రైజింగ్ రోల్..ఫ్యాన్స్ కి పూనకాలే..!!

ట్రైలర్ కూడా సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫామ్స్ లో 24 గంటల్లో 180 మిలియన్ల వ్యూస్ ను దక్కించుకొని అదిరిపోయే రికార్డును నెలకొల్పింది.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు శంకర్ ఈ సినిమాను హోల్డ్ లో పెట్టి భారతీయుడు2 సినిమాను పూర్తిచేశారు. అయితే ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ గా నిలిచింది. నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు..

అయితే ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ పై ఏ మాత్రం వ్యతిరేకత రాకపోవడంతో రోజురోజుకు ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. దీనికితోడు ఇటీవలే చిరంజీవి ఈ సినిమా చూసి అద్భుతంగా ఉందని రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమా ఇంటర్వెల్ కు ముందు వచ్చే 20 నిముషాల సన్నివేశాలతోపాటు సెకండాఫ్ సూపర్ గా వచ్చిందని సమాచారం.. మరీ ఈ సినిమా ఫుల్ రిపోర్ట్ ఏంటనేది రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే..

Related posts

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

filmybowl

మహేష్ తో చేసిన ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి పూర్తి బాధ్యత నాదే – వైట్ల

filmybowl

డాకు మహారాజ్ : అసలు విలన్ ఆయనే..బాలయ్య ఫ్యాన్స్ కి బాబీ బిగ్ సర్ప్రైజ్ ..!!

murali

Leave a Comment