MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు కావొస్తుంది.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దర్శకుడు శంకర్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. తాను తెరకెక్కించిన భారతీయుడు 2 ప్లాప్ కావడంతో ఈ సినిమా సక్సెస్ శంకర్ కు చాలా అవసరం..అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ చేయనున్నారు..

బార్బెక్యూ నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ పండ‌గ‌ ప్రారంభం

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్. జె సూర్య, నవీన్ చంద్ర వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించారు..ఇదిలా ఉంటే శంకర్ సినిమాల్లో భారీతనం కనిపిస్తుంది. సినిమా కథ గాని, విజువల్స్,సెట్స్‌ ఇలా ఏది చూసినా చాలా గ్రాండ్ గా ఉంటుంది… తాజాగా  ‘గేమ్‌ ఛేంజర్‌’లో శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్‌లో శ్రీకాంత్ పాత్ర చాలా భిన్నంగా చూపించారు. ఈ సినిమాలో ఆయన సీనియర్‌ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు.

శ్రీకాంత్ గెటప్ చూసాక ఆసలు ఈయన మన శ్రీకాంతేనా అని అనిపిస్తుంది.. ఆ వెంటనే భలేగా మేకప్‌ కుదిరిందే అని కూడా అనిపిస్తుంది. అయితే ఎక్కడా ఓవర్‌ చేసినట్లుగా లేకుండా.. నేచురల్‌గా శ్రీకాంత్ లుక్ ని శంకర్ డిజైన్ చేయించారు..అంతలా ఎలా సాధ్యమైంది అబ్బా అని చూస్తే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఆ పాత్ర లుక్‌కు స్ఫూర్తి ఆయన తండ్రేనట. శ్రీకాంత్ తండ్రి ఫొటో అంటూ ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఆ పిక్ ని రిఫరెన్స్‌గా తీసుకునే శ్రీకాంత్‌ లుక్‌ను ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా సిద్ధం చేశారట.ఈ విషయం తెలిశాక ఓ పాత్ర సృష్టించడానికి శంకర్ పడే తపన మరోసారి ప్రూవ్ అయింది.. ఆయన పెట్టించే ప్రతీ రూపాయి స్క్రీన్ పై పడేలా చేస్తారు.. దీనితో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..

Related posts

అనిరుథ్‌ – ది మోస్ట్ వాంటెడ్ !

filmybowl

తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!!

murali

‘దేవర’ నచ్చలేదు.. స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ కామెంట్స్..?

murali

Leave a Comment