MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : రాంచరణ్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమా లో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.. క్యూట్ బ్యూటీ అంజలీ మరో హీరోయిన్ గా నటించింది. ఎస్. జె సూర్య, శ్రీకాంత్,సునీల్, నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు..

పుష్ప 2 : భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మొదలైన ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే..?

ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుక గా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ మూవీ కోసం చరణ్‌ ఎంతగానో కష్టపడ్డాడు. మూడు పాత్రల్లో నటించేందుకు లుక్స్ ను పూర్తిగా మార్చుకున్నాడు..మేకర్స్ ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేశారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రమోషన్లు భారీగా చేయబోతున్నారు. మొదటిసారిగా అమెరికాలో ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

ఇదిలా ఉంటే గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్‌ పాత్రకు సంబంధించి భారీ ట్విస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆ ట్విస్ట్ ను సినిమాలోనే రివీల్ చేసే అవకాశం ఉంది.గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ పాత్రకు నత్తి ఉంటుందట. రామ్ చరణ్‌ ఓల్డ్ పాత్ర అయిన అప్పన్నకు ఈ నత్తి ఉంటుందని సమాచారం. గతంలో రంగస్థలం సినిమాలో రామ్ చరణ్‌ పాత్రకు చెవుడు ఉంటుంది. ఆ మూవీలో నిజంగానే చెవుడు ఉన్నట్లు చరణ్‌ అద్భుతంగా నటించాడు.ఆ సినిమా భారీ విజయం సాధించింది..ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కూడా అలాంటి సెంటిమెంట్ ను కావాలనే ఫాలో అవుతున్నట్లు సమాచారం.ఈ మూవీ కూడా పెద్ద హిట్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు

Related posts

మెగాస్టార్ మావయ్యకి కృతజ్ఞతలు.. బన్నీ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ ..!!

murali

గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..?

murali

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్ ఏంటి ?

filmybowl

Leave a Comment