గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించారు.’గేమ్ చేంజర్’ సినిమా కోసం అభిమానులు,సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.. దిల్ రాజు ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, బ్యానర్స్‌పై ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు.
పుష్ప 2 : సెన్సార్ కత్తెరించిన సన్నివేశాలు ఏమిటో తెలుసా ..?
గేమ్ చేంజర్ సినిమా ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీ లో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు.ఇప్పటికే గేమ్ చేంజర్ చిత్రం నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన ‘ టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.అలాగే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన ‘జరగండి’, ‘రా మచ్చా’ లిరికల్ సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ఈ సాంగ్స్ చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఈ సినిమా లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై న్యూజిలాండ్‌లో షూట్ చేసిన థర్డ్ సింగిల్ ‘నానా హైరానా‘ అని సాగే మెలోడీ సాంగ్ ని తాజాగా మేకర్స్ విడుదల చేసారు.
రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను కార్తీక్, శ్రేయా ఘోషల్ ఆలపించారు..లిరిక్స్ ఎంతో కొత్తగా, అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..ఇదిలా ఉంటే ఈ సినిమా లో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించునున్నాడు..ఈ సినిమాకు తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ సినిమా ను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.