స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటేస్ట్ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులలో సినిమాపై మరింతగా అంచనాలను పెంచేసింది. ఈ రేపు (జనవరి 10న) ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది..ఈ సందర్భంగా మేకర్స్ గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు..
గేమ్ ఛేంజర్ : టికెట్ రేట్స్ పెంపుకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!!
ఇటీవలే నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్స్టాపబుల్ టాక్ షోలో చరణ్ పాల్గొన్న సంగతి తెలిసిందే. చరణ్ తో పాటు హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ జనవరి 8 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.ఇదిలా ఉంటే.. గేమ్ ఛేంజర్ మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు..ఈ మేకింగ్ వీడియోలో గేమ్ ఛేంజర్ ఎంతో గ్రాండియర్ గా కనిపిస్తుంది. డైరెక్టర్ శంకర్ నుంచి హీరో రామ్ చరణ్, అంజలి, కియారా అద్వానీ, ఎస్ జే సూర్య నుంచి టెక్నీషియన్స్, ఇతర టీం సభ్యులు ఈ సినిమా కోసం ఎంత హార్ట్ వర్క్ చేశారో ఇందులో చూపించారు.
ఇక ఈ సినిమాలో చరణ్ వైవిధ్యమైన లుక్స్ తో కనిపించారు… చివర్లో చరణ్ యాక్టింగ్ చూసి శంకర్ ఇచ్చిన రియాక్షన్ ఈ వీడియోకే హైలెట్ అయ్యింది..దీంతో ఇప్పుడు ఈ మేకింగ్ వీడియో సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచేసింది..చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటించారు.. తండ్రి కొడుకులుగా చరణ్ నటన సినిమాకే హైలైట్ గా నిలువనుంది..