MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : నిడివి కోసం క్లారిటీ మిస్ చేసిన శంకర్. మరిన్ని సీన్స్ యాడ్ చేస్తారా ..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. “గేమ్ ఛేంజర్” సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ రేట్స్ పెంపునకు అనుమతి ఇవ్వడంతో గేమ్ ఛేంజర్ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి..జనవరి 10 అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి మొదలైంది..5 ఏళ్ళ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందిన సినిమా కావడంతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సంబరాలు జరుపుకున్నారు..అయితే ఈ సినిమా మొదటి షో కి మిక్స్డ్ టాక్ వచ్చింది.ఊహించినంత రేంజ్ లో గేమ్ ఛేంజర్ సినిమా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే ఇంకొంతమంది ఈ సినిమా చాలా రొటీన్ గా ఉందని అంటున్నారు.మరికొంతమంది అయితే ‘ఇండియన్ 2’ సినిమా కంటే కాస్త బెటర్ గానే వుంది అంటున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

మార్నింగ్ షోలతో పోలిస్తే మధ్యాహ్నం షోలకు టాక్ కాస్త ఇంప్రూవ్ అయ్యింది.దీనితో “గేమ్ ఛేంజర్ సినిమాకుఅబౌవ్ యావరేజ్ రెస్పాన్స్ లభించింది.‘పుష్ప 2’ రేంజ్లో చరణ్ గేమ్ ఛేంజర్ అయితే లేదు. మొదటి నుండి ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తుందని అంతా అనుకున్నా ఒకే పార్ట్ గా దర్శకుడు శంకర్ రిలీజ్ చేసారు.సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న, పార్వతీలకు కొడుకు ఉన్నట్టు చూపించారు. అలాగే పార్వతీ ప్రెగ్నెంట్ అని కూడా చూపించారు.అప్పన్న మర్డర్ అయ్యాక.. తర్వాత ఆమె ఏమైంది? ఆమె కొడుకు ఏమయ్యాడు? అనే ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇవ్వలేదు.

అలాగే పార్వతీ పాత్రని చూసి షాక్ అయిన సత్యమూర్తి(శ్రీకాంత్).. తండ్రి అప్పన్న పోలికలతో ఉన్న రామ్ నందన్ ను చూసి ఎందుకు షాక్ అవ్వలేదు. తర్వాత అతనికే ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇచ్చాడు..వంటి పలు ప్రశ్నలకు దర్శకుడు శంకర్ సమాధానాలు ఇవ్వలేదు.ఈ సంక్రాంతికి ‘నానా హైరానా’ సాంగ్ తో పాటు మరికొన్ని సన్నివేశాలు ఏమైనా యాడ్ చేసి క్లారిటీ ఇస్తారా అనేది చూడాలి..

Related posts

ఎదో ఒక డేట్ చెప్పి పుణ్యం కట్టుకోవయ్యా చైతూ

filmybowl

Allu Arjun Pushpa 2: బిజినెస్ ఎంత చేస్తుంది.. హిందీ సంగతేంటి…

filmybowl

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment