MOVIE NEWS

గేమ్ ఛేంజర్ పైరసీ ఇష్యూ.. కృంగిపోతున్న దిల్ రాజు..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం దాదాపు మూడేళ్ళగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు..ఇన్నేళ్ల వారి నిరీక్షణను తెరదించుతూ నిన్న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సినిమా గ్రాండ్ గా విడుదలైంది.గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా ఏమాత్రం లేకపోవడం తో
ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో నిరాశకి గురయ్యారు.

డైరెక్టర్ శంకర్ ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఏంటి అంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు..ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా 250 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టాలిసి ఉంటుంది..అంటే గ్రాస్ వసూళ్లు దాదాపుగా 500 కోట్లు వరకు కలెక్ట్ చేయాలి.. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ సినిమా కేవలం 300 కోట్ల రూపాయిలు మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..?

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన రోజే గేమ్ ఛేంజర్ కి సంబంధించిన HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసేసారు. ఈ ప్రింట్ కి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా లో కొంతమంది చేస్తున్నారు..అసలే సినిమాకి నెగటివ్ టాక్ వచ్చిందని నిర్మాత దిల్ రాజు దిగులు పడుతుంటే ఈ పైరసీ ఇష్యూ ఆయన్ని మరింతగా బాధపెడుతుంది..ఆశ్చర్యం ఏమిటంటే పైరసీ చేసిన వారిపై మూవీ టీం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు..

సోషల్ మీడియా లో ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలు ఇంకా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో దిల్ రాజుకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం వుంది.. దర్శకుడు శంకర్ ని బాగా నమ్మిన మూలంగా దిల్ రాజుకి భారీ నష్టం తప్పేలా లేదు..

Related posts

ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా.. ఆరు సినిమాలు అప్డేట్స్ తో రెడీ !

filmybowl

ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ పై బిగ్ అప్డేట్ వైరల్..!!

murali

అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!!

murali

Leave a Comment