గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తరువాత రాంచరణ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ లో పాల్గొన్నాడు..ఎప్పుడో ప్రారంభం అయిన ఆ సినిమా షూటింగ్ ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు..
న్యూ ఇయర్ స్పెషల్ : కొత్త సినిమాల స్పెషల్ పోస్టర్స్ వైరల్..!!
టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే ఈ సినిమాలో సునీల్,శ్రీకాంత్,ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. అయితే రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. ‘గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు.ఈ మూవీ ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 02 సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది… ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి.శంకర్ మార్క్ డైలాగ్స్ తో ట్రైలర్ కట్ చేసినట్లు తెలుస్తుంది.. గత ఏడాది శంకర్ తెరకెక్కించిన ఇండియన్ 2 ప్లాప్ అవ్వడంతోగేమ్ ఛేంజర్ పై ఎఫెక్ట్ పడుతుందని మేకర్స్ భావించారు కానీ ఆ సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుందని మేకర్స్ ధీమాగా వున్నారు..
The most awaited announcement from #GameChanger is here! 💥
Get ready to witness the king in all his glory! 😎❤️🔥#GameChangerTrailer from 2.1.2025!Let The Games Begin!#GameChangerOnJanuary10🚁 pic.twitter.com/eOyXDCtJRt
— BA Raju's Team (@baraju_SuperHit) January 1, 2025