MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : మాస్ జాతర సాంగ్ “కొండ దేవర”వచ్చేసింది..!!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్న మరో మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.రాంచరణ్, అంజలి జంటగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సాంగ్ రానుంది.‘అలికి పూసిన అరుగు మీద..‘ అనే ఈ మెలోడీ సాంగ్ ని కాసర్ల శ్యామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్ మరియు రోషిని ఆలపించారు… ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్.. తొలిగిన అడ్డంకులు..?

ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ని విడుదల చేసారు.“నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాతర.. కొండ దేవర ” అంటూ ఈ పాట సాగుతోంది. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, తమన్‌, శ్రావణ భార్గవి పాడారు. ప్రస్తుతం ఈ పాట కూడా యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.గేమ్ ఛేంజర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ అప్పన్న పాత్రలో, అంజలి పార్వతి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం..అప్పన్న పాత్రలో చరణ్ యాక్టింగ్ అదుర్స్ అని చిత్ర యూనిట్ తెలిపింది..ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్, ధోప్ సాంగ్, నానా హైరానా సాంగ్, రా మచ్చ సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పాటలన్ని చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్, అలాగే కొండ దేవర సాంగ్ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి..

Related posts

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి గారే.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!!

murali

గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే..?

murali

Leave a Comment