MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : ప్రమోషన్స్ కి దూరంగా కియారా.. కారణం అదేనా..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్’’.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 10వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ బిజీ బిజీగా ఉన్నారు. సినిమా విడుదల తేదీకి ఇంక ఐదు రోజులు మాత్రమే సమయము ఉండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మరింత వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

అకిరా నందన్ తో ఖుషి 2..ఎస్.జె సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలకు మూవీ మేకర్స్ దాదాపుగా అందరూ పాల్గొంటున్నారు. శంకర్, రామ్ చరణ్ తో పాటు SJ సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి ఇలా స్టార్స్ అంతా హాజరవుతున్నారు. కానీ సినిమాలో హీరోయిన్ గా నటించిన కియారా అద్వానీ మాత్రం ప్రమోషన్స్లో ఎక్కడా కనిపించడం లేదు. ఒక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో తప్ప ఇప్పటివరకు కియారా ఈ సినిమా ప్రమోషన్స్ లో కనపడలేదు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో గ్రాండ్ గా జరిగింది..అదే రోజు ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కి కూడా కియారా హాజరవకపోవడంతో ఈ విషయం మరింత చర్చకు దారి తీసింది..

కానీ బాలీవుడ్ లో కొన్ని ఇంటర్వ్యూలలో చరణ్ తో పాటు కియారా అద్వానీ పాల్గొంది… అయితే ఇంత పెద్ద సినిమాకు కియారా ఎందుకు ప్రమోషన్స్ కి రావట్లేదు అని అంతా చర్చించుకుంటున్నారు. కియారాని ప్రమోషన్స్ కి తీసుకురమ్మని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.. అయితే బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం కియారా హాస్పిటల్ లో ఉందని, ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది వారు రాసుకొచ్చారు . అందువల్లే ఆమె గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదు అంటూ వార్తలు వినిపించడంతో.. దీనిపై కియారా మేనేజర్ స్పందిస్తూ.. కియారా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేదు. తను విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల కొద్దిగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు.

Related posts

ప్రభాస్‌-సందీప్‌ రెడ్డి వంగా సినిమా షూటింగ్‌కు మొదలయ్యేది అప్పుడే

filmybowl

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

హరి హర వీరమల్లు: పవన్ కళ్యాణ్‌ తిరిగి సెట్స్‌లో

filmybowl

Leave a Comment