MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : రన్ టైం విషయం లో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..?

గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే సినిమాలో క్యూట్ బ్యూటీ అంజలీ కూడా ముఖ్య పాత్రలో కనిపిస్తుంది.. ఎస్. జె. సూర్య, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయినా కూడా కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది..

ఈ సినిమాను మేకర్స్ జనవరి 10 2025 సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది..మరో ఇరవై ఎనిమిది రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమా థియేటర్స్ లోకి వచ్చేస్తుంది..డిసెంబర్ 21 యుఎస్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్ల వేగం పెంచబోతున్నారు.అయితే నిన్న వదిలిన కొత్త ప్రోమోలో గతంలో చూడని విజువల్స్ ఉండటం ఫ్యాన్స్ ని కాస్త సంతోషపరిచింది. తాజాగా వచ్చిన సమాచారం మేరకు ఈ చిత్ర నిడివి 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.

“పుష్ప 2” ని ప్రశంసించిన ఏకైక స్టార్ హీరో అతనే..!!

అయితే శంకర్ సినిమాలు మూడు గంటలు లేదా అంతకు మించి ఉంటాయి. ఇంత తక్కువ లెన్త్ రామ్ చరణ్ కు ప్లాన్ చేయడంతో సినిమాలో ల్యాగ్ సీన్స్ ఏమి లేకుండా శంకర్ ఈ సారి పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది..అయితే సెన్సార్ కాపీ ఇంకా సిద్ధం కాలేదు కనుక ఇదే కరెక్ట్ రన్ టైం అని చెప్పలేము.. కానీ శంకర్ లాక్ చేసుకున్న ఫైనల్ ఎడిట్ కూడా ఇంతే ఉంటుందనీ సమాచారం…ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రాంచరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్న అప్పన్న ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అదిరిపోతాయని తెలుస్తుంది.

Related posts

గేమ్ ఛేంజర్ : “నానా హైరానా” లిరికల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్..!!

murali

పుష్ప 2 : ఆ సీన్ చూసాక రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం అదేనా..?

murali

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

murali

Leave a Comment