MOVIE NEWS

‘డాకు మహారాజ్’ షో కు ‘గేమ్ ఛేంజర్’..ఆఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఆహా టీం..!!

నటసింహ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూనే హోస్ట్ గా కూడా అదరగొడుతున్నారు.. బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న “అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే “షో మూడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది.ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో నాలుగవ సీజన్ జరుగుతుంది..అందులో భాగంగానే మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయగా ఆ తర్వాత వరుసగా స్టార్స్ గెస్ట్ గా వచ్చారు..తమ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షో కి వచ్చి సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు.

మెగా vs అక్కినేని.. ఊహించని కాంబో సెట్ చేస్తున్న అనిల్ రావిపూడి..?

రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వెంకటేష్, అనిల్ రావిపూడి నిర్మాత సురేష్ బాబు వచ్చి సందడి చేశారు. అయితే ఇప్పుడు ఎనిమిదవ ఎపిసోడ్ కి ఎవ్వరూ ఊహించని గెస్ట్ రాబోతున్నారు.. తాజాగా ఆహా టీం అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఆ ఊహించని గెస్ట్ ఎవరో కాదు ఎవరో కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా జనవరి 10వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ కార్యక్రమాలలో స్పీడ్ పెంచారు..అందులో భాగంగానే రామ్ చరణ్ ఇప్పుడు ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే కార్యక్రమానికి రాబోతున్నారు. ఈ విషయాన్ని ఆహా ఆఫీసియల్ గా అనౌన్స్ చేసింది..ఈ మేరకు ట్విట్టర్ అధికారిక ఖాతా ద్వారా..” ఒరేయ్ చిట్టి బాబు వస్తున్నాడు.. రీ సౌండ్ ఇండియా అంతా వినపడేలా చెయ్యండి” అంటూ ఫైర్ ఎమోజీని షేర్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..ఈ క్రేజీ ఎపిసోడ్ జనవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ కి రానుంది..

Related posts

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

murali

పుష్ప సినిమాకు పార్ట్ 3 అవసరమా..నెటిజన్స్ కామెంట్స్ వైరల్..!!

murali

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

Leave a Comment