గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్” జనవరి 10న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్ మరియు ట్రైలర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది..తాజగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.రాంచరణ్, అంజలి జంటగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ సాంగ్ రానుంది. ఇటీవల జరిగిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ పాటను మేకర్స్ వినిపించారు. ఈ మెలోడీ సాంగ్ అందరికి తెగ నచ్చేయడంతో అధికారికంగా పాటను రిలీజ్ చేయమని ఫ్యాన్స్ మేకర్స్ ని రిక్వెస్ట్ చేసారు.
దీంతో తాజాగా చిత్ర యూనిట్ ‘అలికి పూసిన అరుగు మీద.. ‘ అనే ఈ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఇక ఈ సాంగ్ కాసర్ల శ్యామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో తమన్ మరియు రోషిని ఆలపించారు… ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో చరణ్ అప్పన్న పాత్రలో, అంజలి పార్వతి పాత్రలో నటిస్తున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాక్ హైలైట్ కానుందని సమాచారం..అప్పన్న పాత్రలో చరణ్ యాక్టింగ్ అదుర్స్ అని చిత్ర యూనిట్ తెలిపింది..ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి జరగండి జరగండి సాంగ్, ధోప్ సాంగ్, నానా హైరానా సాంగ్, రా మచ్చ సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ పాటలన్ని చార్ట్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ మెలోడీ సాంగ్ కూడా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది..