MOVIE NEWS

గేమ్ ఛేంజర్ : సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది..ఇక అసలైన ఆట మొదలు కానుందా..?

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోగా తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్‌ ఛేంజర్‌”.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మించారు.ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ముఖ్యంగా ఫ్ల్యాష్ బ్యాక్‌లో వచ్చే తండ్రి పాత్ర, అందుకు సంబంధించిన సన్నివేశాలు సినిమా స్థాయిని అమాంతం పెంచే విధంగా ఉంటాయని సమాచారం…

Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

సెకండ్ హాఫ్‌లో వచ్చే అంజలి క్యారెక్టర్ కూడా సినిమాకు హైలైట్ అవుతుందని సమాచారం.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ హీరోయిన్ గా నటించింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సెన్సార్‌ బోర్డ్‌ సభ్యుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కింది. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లోని సన్నివేశాలకు సెన్సార్‌ బోర్డ్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చిందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. అంతే కాకుండా కొన్ని సన్నివేశాల్లో డైలాగ్స్‌ని మ్యూట్‌ చేయడం, కొన్ని టైటిల్‌ కార్డ్స్ పేర్లను తొలగించడం ఇలా సెన్సార్‌ బోర్డ్‌ నుంచి చిన్న చిన్న మార్పులతో ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చింది. సెన్సార్‌ బోర్డ్‌ ఇచ్చిన సర్టిఫికెట్ ప్రకారం ఈ సినిమా మొత్తంగా 165 నిమిషాలు అంటే 2 గంటల 45 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఉంటుంది.నార్మల్ రన్‌ టైమ్‌ తో ఈ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రామ్‌ చరణ్ నాలుగు ఏళ్ల తర్వాత ఈ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకులని అలరించబోతున్నాడు…

Related posts

“విశ్వంభర” హడావుడి తగ్గడానికి కారణం అదేనా..?

murali

ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్ ఏంటి ?

filmybowl

రాంచరణ్ : ఆ విషయంలో అలా ఎందుకు జరుగుతుందో ఇప్పటికీ అర్ధం కావట్లేదు..!!

murali

Leave a Comment