MOVIE NEWSUncategorized

ఎట్టకేలకు ‘వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా విడుదల ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా ఏమంటూ మొదలు పెట్టారో కానీ మొదలు నుంచి అన్నీ అడ్డంకులే.. దర్శకుడు మారడం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీ అవ్వడం ఈ సినిమా రిలీజ్ కు అడ్డంగా నిలిచాయి.. రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నారు గాని సినిమా రిలీజ్ అవ్వట్లేదు..ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు.. ఈ సినిమా ఎట్టకేలకు అన్ని అడ్డంకులను దాటుకొని జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది.

జక్కన్నతో తారక్ మరో క్రేజీ మూవీ.. ఈ సారి అంతకుమించి..!!

ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకు సంబంధించిన మొత్తం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో విడుదల అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పెద్దెత్తున విడుదల కానుంది. అమెజాన్ ప్రైమ్ దీని డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ హరి హర వీరమల్లు సినిమా గత కొన్నేళ్లుగా ఆలస్యమవుతూ వచ్చింది. హీరో పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిరవధికంగా ఆగిపోవడంతో ఆలశ్యం అయ్యింది. కానీ ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొని పూర్తి చేశారు. మే 6, 2025న సినిమా చిత్రీకరణ ముగిసినట్లు నిర్మాతలు ప్రకటించారు.

గతంలో ఈ సినిమా మార్చి 28, మే 9 తేదీలలో విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు… కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది..ఆస్కార్ విన్నర్ కీరవాణి గారు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు..

 

Related posts

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

murali

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. ఇక దబిడి దిబిడే..?

murali

Leave a Comment