అశోక్ గల్లా 2022 లో హీరో సినిమాతో తన సినీజీవితాన్ని ప్రారంభించాడు
#Hero సినిమా అనుకున్నంత ఆడకపోయిన హీరో గా అశోక్ మంచి ఈజ్ తో పెర్ఫార్మ్ చేసాడని మంచి పేరు వచ్చింది
ఇక రెండవ చిత్రం గా దేవకి నందన వాసుదేవ చిత్రాన్ని మొదలెట్టాడు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ అందించగా అర్జున్ జంధ్యాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దం గా ఉంది
ఇప్పుడు మూడో చిత్రం గా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, వంశీ నిర్మాణంలో ఉద్భవ్ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తుంది అమెరికా నేపధ్యంలో ఇప్పటి యూత్ కి నచ్చే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కి పూజా కార్యక్రమాలు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గారు ముఖ్య అతిధి గా పాల్గోని పూర్తి చేసారు.
Also Read : https://filmybowl.com/telugu/film-new-highlighting-devara-iconic-scenes-and-moments-explained/
MAD ఫేమ్ శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్ గా రాహుల్ విజయ్, శివాత్మిక ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది అని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని దర్శకుడు చిత్ర విశేషాలు మీడియాతో పంచుకున్నారు.