Koratala messed up Vara & Thangam relationship in Devara
MOVIE NEWS

దేవర ని హైలెట్ చేయనున్న సీన్స్ ఏంటి ?

Highlighting Devara: Iconic Scenes and Moments Explained
Highlighting Devara: Iconic Scenes and Moments Explained

దేవర సినిమాకి హైలైట్ ఏంటి అంటే అందరూ చెప్పే మాట ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ కి తొడుగ మాస్ డైరెక్టర్ కొరటాల, నేషన్స్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, అతిలోక సుందరి కూతురు జాన్వీ మొదటి సారి తెలుగు స్క్రీన్ మీద మెస్మరైజ్ చేయబోతున్నారు

ఇవన్నీ కాకుండా ఇంకేంట!!!! సరే పదండి ఒక లుక్ వేద్దాం

1. కుస్తీ పోటీ – మల్ల యుద్ధం
ఇవన్నీ తెలుగోడి బాగా ఇష్టమైన నేపథ్యం

అలంటి నేపధ్యాన్ని ఈ సినిమా లో ముఖ్య సన్నివేశం దగ్గర దర్శకుడు కొరటాల చిత్రీకరించాడని సమాచారం
ఎన్టీఆర్ – సైఫ్ మధ్య వచ్చే ఈ సన్నివేశం అదిరిపోయిందని టాక్

2. అండర్ వాటర్ సీక్వెన్స్

ఈ సినిమా లో ఎక్కువగా మాట్లాడుకున్న ఎపిసోడ్ ఇదే
ఎన్టీఆర్ మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ లో తాను , తన టీం ఎంతగా కష్టపడింది
ఆ ఎండ తీవ్రతలో చేసిన అండర్ వాటర్ సీక్వెన్స్ ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతి మిగులుస్తుంది అనడం లో సందేహం లేదు అంటున్నారు

3. హాఫ్ మూన్ సీ ఫైట్

దేవర టీజర్ రిలీజ్ అయినప్పుడు అందరూ మాట్లాడుకున్న మరొక సీక్వెన్స్

దేవా ప్రత్యర్థులతో యుద్ధం ఎంత భీకరంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం

తన కత్తి పదును , తన చేతి ఆవేశం రెండు కలిపి చంద్రుడిని కూడా ఎరుపెక్కించాడు

ఈ సీన్ సినిమా కి మేజర్ హైలైట్ అవనుంది

4. ఆయుధ పూజ – ఫెస్టివల్ సాంగ్

ఈ ఆలోచనే మనలో ఒకరకమైన ఉద్వేగాన్ని తీసుకొస్తది. తెలుగు సాంప్రదాయం , ఆచారం , అలాగే ఎన్టీఆర్ లో వెన్నంటి వుండే మాస్ ఈ పాటని ప్రేక్షకుడి ముందు ప్రత్యేకంగా నిలబెట్టనుంది

Also Read : https://filmybowl.com/telugu/lokesh-kanagaraj-responds-to-coolie-footage-leak-controversy/

5. కనపడని మరో ఎన్టీఆర్

ఇప్పటిదాకా దేవర టీం వదిలిన పోస్టర్స్ అన్ని దేవా, వర యంగ్ ఏజ్ లో వుండే స్టిల్స్ మాత్రమే వదిలి పెద్ద వయసులో వున్నా దేవాని మాత్రం దాచిపెట్టారు

ఆ దేవా ఎలా ఉంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరం
సినిమాని మలుపు తిప్పే సీన్ లో ఆ పెద్ద వయసున్న దేవా వస్తాడని తెలుస్తుంది

ఆ దేవా ఎంట్రీ కి , అనిరుద్ మాస్ మ్యూజిక్ తోడైతే సినిమా ప్రేక్షకుడికి సినిమాటిక్ హై తధ్యం

6. దేవర సాంగ్స్

ఇప్పటికే విడుదలైన దేవర పాటలు అటు మాస్ ని , ఇటు యూత్ ని , ముఖ్యంగా చుట్టమల్లె పాట ప్లేలిస్ట్ ని కబ్జా చేసింది అంటే అతిశయోక్తి కాదు.

ఇక ఆ పాటలు తెరపై ఎలా ఉంటాయి అనేది అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది

పైన చెప్పిన అన్నీ ఒకే సినిమా లో కుదరడం ఎన్టీఆర్ లాంటి హీరో తోడవడం తో దేవర సినిమాకి ఆకాశమే హద్దు అన్నట్టుంది

దానితో పాటు ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు

https://x.com/FilmyBowl/status/1837498808256942123

Related posts

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

పూరి జగన్నాథ్‌ కి హీరో నే దొరకట్ లేదు….

filmybowl

Leave a Comment