MOVIE NEWS

“ఫౌజీ” మ్యాజిక్ మాములుగా ఉండదు.. హను రాఘవపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ఫౌజీ”.. టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ బిగ్గెస్ట్ పీరియాడికల్‌ యాక్షన్ డ్రామా తెరకెక్కుతుంది..క్యూట్ బ్యూటీ ఇమాన్వీ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా మేకర్స్  ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు..

హ్యాండ్ ఇచ్చిన ఐకాన్ స్టార్ .. మరి త్రివిక్రమ్ పరిస్థితేంటి..?

దర్శకుడు హనురాఘవపూడి ఈ సినిమాను సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నారు..ఈ మూవీ నుండి రిలీజ్ అయిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది..ఈ కాన్సెప్ట్ పోస్టర్ లో కలకత్తా హౌరా బ్రిడ్జ్‌, సుభాష్‌ చంద్రబోస్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పతాకం, హైదరాబాద్‌ చార్మినార్‌ ను చూపించారు.ఈ కాన్సెప్ట్ పోస్టర్ తో ఈ సినిమా 1940 స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా సాగుతున్నట్లు వారు తెలిపారు. మాతృభూమి ప్రజలకు న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా సాగనున్న ఈ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు.

అయితే ప్రభాస్ తో తాను చేస్తున్న మూవీ ఎప్పుడూ చూడని ప్రపంచంలోకి తీసుకు వెళ్తుందని హను రీసెంట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.దీనితో సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..సీతారామం తర్వాత తాను తెరకెక్కించబోయే మరో అద్భుతమైన సినిమా ఇదేనని ప్రేక్షకులు కచ్చితంగా సర్ప్రైజ్ ఫీలవుతారని హనురాఘవపూడి తెలిపారు..త్వరలోనే అఫీషియల్ రిలీజ్ డేట్ ను ప్రకటించి..ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేయనున్నారట.దీనితో సైనికుడిగా ప్రభాస్ సర్ప్రైజింగ్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 

Related posts

లైలా ఎఫెక్ట్.. అసభ్యత జోలికి పోనంటున్న విశ్వక్ సేన్..!!

murali

జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!!

murali

ప్లీజ్ అలా చేయొద్దు.. ఫ్యాన్స్ కి తారక్ రిక్వెస్ట్..!!

murali

Leave a Comment