fans audience disappointed with that prabhas look from raajasaab
MOVIE NEWS

ప్రభాస్ లుక్ పై మరోసారి పెదవి విరుస్తున్న నెట్టిజన్లు…

fans audience disappointed with that prabhas look from raajasaab
fans audience disappointed with that prabhas look from raajasaab

Prabhas Look from Raajasaab :  రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న తాజా మూవీ ‘ది రాజాసాబ్’. కామెడీ, హర్రర్ థ్రిల్లర్ జానర్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

Prabhas Look from Raajasaab : ప్రభాస్ బర్త్ డే నీ పురస్కరించుకొని చిత్ర బృందం మొన్న రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ కి అన్ని వర్గాల నుంచి అప్లాస్ లభించింది. గల్లా చొక్కా, నల్ల ఫాంట్ , లోపల టీ షర్ట్ లో డార్లింగ్ మెరిసిపోయాడు.

ఇది శాంపిల్ మాత్రమే బర్త్డే రోజు మీకు పెద్ద ట్రీట్ రాబోతుంది అని ప్రభాస్ అభిమానులని వూరించించింది చిత్ర బృందం. అభిమానులు కూడా ఇంకా అదిరిపోయే పోస్టర్ చూడచ్చు అని అనుకున్నారు.

ఇది చూసి చిత్ర బృందం కంగారు పడిపొయిందేమో అన్నట్టు. సినిమా కి దిష్టి తగుల్తది అనుకున్నారేమో ఈరోజు రిలీజ్ చేసిన మోషన్ పిక్చర్, ప్రభాస్ పోస్టర్ కి మిశ్రమ స్పందన వస్తుంది.

చాలా రాయల్ గా చైర్ లో కూర్చున్న ప్రభాస్ , ఆ వెనుక సెట్ అప్ అంత బావుంది, తమన్ ఇచ్చిన హాంటింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బానే వుంది కానీ డార్లింగ్ కి పెట్టిన విగ్ అది సెట్ అవ్వలేదు అంటున్నారు అభిమానులు.

సోషల్ మీడియా లో ఇప్పటికే ఆ లుక్ మీద ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడెప్పుడో వెంకీ చేసిన నాగవల్లి సినిమా లో అఘోర గేట్ అప్ తో పో, ఇంకొందరు దమ్ము సినిమా లో సుమన్ వేషధారణ లో ఉన్నాడని అంటున్నారు.

Read Also : ప్రభాస్ మొదటి సినిమా కథ ఇదే

ఏదైనా చిత్ర బృందం మరొక్క సారి సరిచూసుకుని కరెక్షన్స్ చేసుకుంటే రాజసాబ్ తో మరో వెయ్యి కోట్లు ఖాతాలో వేసుకుంటాడు ప్రభాస్.

రాజసాబ్ మూవీలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న విష‌యం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నారు. 2025 వేసవి సందర్భంగా ఏప్రిల్ 10న ‘రాజాసాబ్’ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Follow us on Instagram 

Related posts

ఆ స్టార్ హీరోతో భారీ పాన్ ఇండియా మూవీ.. కొరటాల స్కెచ్ అదిరిందిగా..!!

murali

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

murali

మెగా సీజన్ స్టార్ట్స్

filmybowl

Leave a Comment