Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas
MOVIE NEWS

తండేల్‌ లో శివరాత్రి సంబరం

Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas
Experience Joy of Shivaratri at Naga Chaitanya Thandel -bunnyvas

Naga Chaitanya Thandel bunnyvas : శ్రీకాకుళం జిల్లాలోని మత్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తండేల్‌’. ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌ ఇండియా మూవీకి కార్తికేయ తో అద్భుతమైన విజయాన్ని ,అందరి ప్రశంసలతో పాటు జాతీయ అవార్డ్స్ కూడా గెలుచుకున్న మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకుడు.

గీతా ఆర్ట్స్‌ పతాకంపై బన్నీ వాస్‌ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళంలో దక్షిణకాశీగా పేరు గాంచిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. అక్కడ వైభవంగా జరిగే శివరాత్రి మహోత్సవాలను ఆదర్శంగా తీసుకొని అద్భుతమైన శివరాత్రి జాతర పాటను ఈ సినిమా కోసం చిత్రీకరించారు. దేవిశ్రీప్రసాద్‌ అద్భుతంగా ఈ పాటను కంపోజ్‌ చేశారని, శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో వేలాదిమంది డ్యాన్సర్స్‌తో కలిసి నాగచైతన్య, సాయిపల్లవి ఈ పాటకోసం చేసిన డ్యాన్స్‌ కొన్నేళ్లపాటు గుర్తుండిపోతుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఇండస్ట్రీ కి శివుడి కి విడదీయలేని సంబంధం వుంది. ఆయన మీద తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎన్నో గొప్ప పాటలు వచ్చాయి అలాంటి వాటి మధ్య ఈ పాట కూడా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది.

Read Also : రజనీకాంత్‌కు అనారోగ్యం.. చెన్నై అపోలో ఆసుపత్రికి తరలింపు

ఈ సందర్భంగా ఈ పాట షూట్‌ నుంచి రెండు పోస్టర్లను నిర్మాత విడుదల చేశారు. నాగచైతన్య, సాయిపల్లవి ట్రెడిషనల్ దుస్తులతో ఈ పోస్టర్లో కనువిందు చేసారు . పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: షామ్‌దత్‌, సమర్పణ: అల్లు అరవింద్‌.

కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా లేక సతమతవుతున్న నాగ చైతన్య కి ఈ సినిమా తో మంచి విజయం వస్తుందని చాలా ఆశతో ఉన్నాడు. పైగా గీత ఆర్ట్స్ లో ఇది తనకి రెండో చిత్రం. మొదటి చిత్రం 100% లవ్ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

Follow us on Instagram

Related posts

వార్ 2 : ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఊహించని ట్విస్ట్.. ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ గ్యారెంటీ..!!

murali

పుష్ప 2 టికెట్ ధరలు భారీగా పెంపు ..పెరిగిన ధరలు ఎలా వున్నాయంటే..?

murali

మోక్షజ్ఞ మూవీలో పవర్ స్టార్ ఫేవరెట్ బ్యూటీ.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment