War 2 to have more stars
MOVIE NEWS

‘వార్‌ 2’ నుంచి ఎక్స్సైటింగ్ అప్డేట్‌….

 

Exciting update from War 2
Exciting update from War 2

War 2 : ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయాడు. ఆ తర్వాత వచ్చిన దేవర బాలీవుడ్ లో ఎన్టీఆర్ స్థానం పదిలం చేసింది దాంతో ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్‌ మేకర్స్ చాలా ఆసక్తి కనబరుస్తున్న విషయం తెల్సిందే. వాటికి తగ్గట్టుగానే స్టోరీ లు వినే పని లో ఉన్నాడు తారక్

ప్రస్తుతం బాలీవుడ్ స్టైలిష్ హీరో హృతిక్ తో కలిసి వార్‌ 2 లో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. దేవరతో ఎన్టీఆర్ కి అంటూ నార్త్ లో సెపరేట్ మార్కెట్ ఏర్పడడంతో వీళ్లిద్దరి స్టార్ డమ్ కలిసి ఈ సినిమా మొదటి రోజు 200 కోట్లు కలెక్ట్ చేస్తోందని అంచనాలు వేసుకుంటున్నారు.

వార్‌ ki సీక్వెల్ గా వస్తున్న వార్‌ 2 సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టు గానే ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు అయాన్‌ ముఖర్జీ భారీ బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

యశ్‌ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో కదానాయిక గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

హృతిక్ తో కలిసి ఎన్టీఆర్‌ ఉన్న సన్నివేశాలు, యాక్షన్‌ సీన్స్ ను ఇక మొదలు పెట్టాల్సి ఉంది. దాని కంటే ముందు ఎన్టీఆర్‌, హృతిక్ కాంబోలో ఒక మంచి మాస్ డాన్స్ సాంగ్‌ ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. సెట్‌ వర్క్ పూర్తి అయిందని ఇక షూటింగ్ మొదలు పెట్టడమే ఆలస్యం అంటున్నారు.

Read Also : ప్రభాస్ బర్త్ డే స్పెషల్స్ ఏంటి ?

ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర తో పెద్ద సక్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ ఉత్సాహం తో వార్‌ 2 సినిమా పాట కోసం అక్టోబర్‌ లో సినిమా యూనిట్ తో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వైభవి నేతృత్వంలో పాట చిత్రీకరణ జరగబోతుంది.

టాలీవుడ్‌ లో బెస్ట్‌ డాన్సర్స్ లో ఎన్టీఆర్‌ ఒకరు. ఇక బాలీవుడ్‌ లో బెస్ట్‌ డాన్సర్ హృతిక్ రోషన్ అనే విషయం తెల్సిందే. అలాంటి వీరిద్దరి కాంబోలో మాస్ పాట అంటే కచ్చితంగా అది ఏ లెవల్‌ లో ఉంటుందో ఆ ఎక్సపెక్టషన్స్ ఎలా ఉంటాయో అందరికి తెలుసు.

RRR లో నాటు నాటు పాటకి కచ్చితంగా పోలికలు తీస్తారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే మంచి డ్యాన్స్ కూడా కంపోజ్ చేసారని తెలుస్తుంది

Follow us on Instagram

Related posts

ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?

murali

గేమ్ ఛేంజర్ : చరణ్ యాక్టింగ్ కి స్టన్ అయిపోయిన శంకర్.. మేకింగ్ వీడియో వైరల్..!!

murali

శ్రీ తేజ్ ని పరామర్శించా..కానీ పబ్లిసిటీ చేసుకోలేదు.. జగపతి బాబు షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment