Exciting news on Mokshagna debut film
MOVIE NEWS

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి .. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్

Exciting news on Mokshagna debut film
Exciting news on Mokshagna debut film

Mokshagna debut film : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ నుంచి నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తారక రామ తేజ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

ఈ అఫిషియల్ ఎంట్రీ కి ముందు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి చాలా వార్తలు వచ్చాయి. అందులోనూ మోక్షు మొదటి సినిమా దర్శకుడు గురించి ఎవరా అని చాల పేర్లు విన్నాం. ఎట్టకేలకు మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. పైగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వుంటుంది అని చెప్పడంతో అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన మొక్షు బర్త్ డే సందర్భంగా టీం నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది.

ఈ సినిమా నీ ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ ఈ చిత్రం కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉండడంతో పాటు కాస్టింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టులో మాంచి పేరున్న నటీనటులను ఎంపిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే హీరోయిన్ గా బాలీవుడ్ అమ్మాయి నీ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఇంకా ఈ చిత్రం లో అత్యంత కీలకమైన పాత్ర అయినటు వంటి హీరో తల్లి పాత్రకి నటించబోయేది ఎవరన్న దానిపై ఓ ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. దాని ప్రకారం.. ఇందులో హీరో మదర్‌గా సీనియర్ హీరోయిన్ శోభనను తీసుకున్నట్లు తెలిసింది.

1980 ల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శోభన తెలుగులో చాలా చిత్రాల్లో నటించి మెప్పించారు. అయితే, ఆ తర్వాత వెండితెర కి దూరంగానే ఉన్నారు.

ఇటీవలే ఆమె ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకున్నారు. అప్పటి నుంచి ఫిల్మ్ మేకర్స్ మళ్ళీ శోభన కి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధం అయ్యారు.

Read Also :  చందూ… ఈ సారి భారీ పిరియాడిక‌ల్ డ్రామా

ఈ క్రమంలోనే శోభనకు మోక్షజ్ఞ తల్లిగా నటించే అవకాశం లభించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కూడా కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఇందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అంటున్నారు.

గతంలో శోభన, బాలయ్య కాంబినేషన్ లో పలు హిట్ సినిమాలు వచ్చాయి. ‘నారి నారి నడుమ మురారి’, ‘మువ్వ గోపాలుడు’ వంటి సినిమాలు ఇప్పటికీ ఆడియెన్స్ ను మెప్పిస్తూనే వున్నాయి.

ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కాబోతుంది అని అంటున్నారు.

Follow us on Instagram

Related posts

బాలయ్య ” డాకు మహారాజ్ “రన్ టైం లాక్.. మొత్తం ఎన్ని నిముషాలంటే..?

murali

పుష్ప 2 : మ్యూజిక్ కాంట్రవర్సీ..దేవిశ్రీ కామెంట్స్ పై స్పందించిన ప్రొడ్యూసర్..!!

murali

స్పిరిట్ : టీజర్ రిలీజ్ కు రంగం సిద్ధం.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment