TFI Hero Fans : ఒక సినిమా ఎంజాయ్ చేస్తూ ఎలా చూడాలో తెలుగు సినిమా ప్రియులకి తెలిసినట్టు ఎవరికీ తెలీదు. ఈ మాట ప్రతి ఇండస్ట్రీ నుంచి తెలుగు సినిమా అభిమాని గురించి విన్న మాట.
ఒక నార్మల్ లవ్ స్టోరీ కే ఎంతో రచ్చ చేసే అభిమానులున్న తెలుగు సినిమా అదే మాస్ సినిమా వస్తే ఎలా ఊగిపోతారో, ఎలా ఊపేస్తారో మాటల్లో చెప్పలేం.
తెలుగు ఇండస్ట్రీ లో హీరోలకి Demi God స్టేటస్ వర్షిప్ ఉంటది. వాళ్ళ కోసం చొక్కాలు చించేసుకునే అభిమానులున్నారు , తేడా వస్తే ఎదుటోడి చొక్కా పట్టుకొని కొట్లాటకు దిగే వాళ్ళున్నారు.
ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం అయ్యేసరికి కాస్త తగ్గింది గాని లేకపోతే పైన చెప్పిన సన్నివేశాలు ప్రతి సినిమా రిలీజ్ రోజు చూసేవాళ్ళం.
ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్ధమయ్యే ఉంటది. దేవర సినిమా రిలీజ్ తో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళి ఈ రచ్చ మొదలైంది సినిమా ప్రీమియర్స్ నుంచే హిట్ , సూపర్ హిట్ అని NTR అభిమానులు రచ్చ చేస్తుంటే. ప్లాప్ డిసాస్టర్ అని మిగతా హీరోల అభిమానులు విషం కక్కడం మొదలుపెట్టారు. అదీ ఎంత వరకు వెళ్తుంది అంటే రాత్రుళ్ళు నిద్ర మానుకొని మరి భూతులు తిట్టుకునే అంత.
Read Also : దేవర డే 2 కలెక్షన్స్ – గుడ్ హోల్డ్
దీనికి తోడు దేవర సినిమా బృందం డే 1 కలెక్షన్స్ బయటకి రిలీజ్ చేసింది ఇక అక్కడనుంచి ఈ అభిమానుల మాటల యుద్ధం అంత ఇంత కాకుండా పోయింది ఇది ఫేక్ అంటే మీ సినిమా ఫేక్ అంటూ పాత సినిమాల లెక్కలన్నీ బయటకి తీసి వాదనలు చేసుకుంటున్నారు
మాములు రోజుల్లో TFI బావుండాలి , యునైటెడ్ TFI అని ట్రెండ్ చేస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేలంగి మావయ్య ని గుర్తుకుతెచ్చే తెలుగు సినిమా ప్రేమికులు రిలీజ్ టైం కి వచ్చేసరికి మాత్రం చంద్రముఖి కి అమ్ముమ్మ లాగ మారిపోయి కొట్టేసుకుంటుంటారు.
ఇలాంటి వాదనలు ఈ మూడు రోజులు తో ముగించేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు అనుకోండి కానీ ఇంతలా సినిమా , హీరో మీద ఈ అభిమానం వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తుందో మరి.
Follow us on Instagram