తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించారు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రాంచరణ్.. “గేమ్ ఛేంజర్” సినిమాతో మొదటి సారి శంకర్ డైరెక్షన్ లో నటించాడు.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ అలాగే క్యూట్ బ్యూటీ అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ డ్యూయల్ రోల్ లో నటించాడు.. భారీ అంచనాలతో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
మేము ఈ స్థాయిలో ఉండటానికి కారణం చిరంజీవి గారే.. పవన్ కల్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!!
ఈ నేపథ్యంలో మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడిన మాటలు అందరిలో సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.ప్రేక్షకులను సీట్లకు అతుక్కునిపోయేలా చేసే శక్తి కంటెంట్‌కు మాత్రమే ఉంటుంది. సినిమాలో కథ లేకపోతే ఎలివేషన్ ఉండి ఎలాంటి ఉపయోగం ఉండదు. సినిమాలో ఎన్ని వున్నా మంచి కథను ఏదీ బీట్ చేయలేదు.. చెడ్డ కంటెంట్‌ను ఏదీ సపోర్ట్ చేయదు. నేను పలు ప్రాంతాల్లో ఒకేఒక్కడు పాటలను షూట్ చేసినప్పటికీ.. కేవలం కంటెంట్ మాత్రమే సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్ళింది అంటూ ఆ సినిమాను శంకర్ ఓ ఉదాహరణ చెప్పుకొచ్చారు..శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.
ఈ చిత్రంలో నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, బాలీవుడ్ యాక్టర్ హ్యారీ జోష్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరామ్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.