ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన “పుష్ప2” సినిమా సంచలన విజయం సాధించింది.. అయితే రిలీజ్ కి ముందు వేసిన ప్రీమియర్ షో సందర్భంగా అల్లుఅర్జున్ సంధ్య థియేటర్ కి తన ఫ్యామిలీతో కలిసి రాగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.ఆ ఘటనలో ఓ మహిళ చనిపోయింది..ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో వున్నాడు.. ఈ ఘటనలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయగా హైకోర్ట్ మధ్యంతర బెయిల్ ఇచ్చింది.. ఈ ఘటన గత కొన్ని రోజులుగా దేశమంతా సంచలనం సృష్టించింది..ఇదిలా ఉంటే తాజాగా వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.సోమవారం ఆయన మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ వ్యవహారం గోటితో పోయేదానికి గొడ్డలి వరకూ తీసుకొచ్చారని ఆయన అన్నారు.
కల్కి 2898 AD : కృష్ణుడిగా మహేష్.. నాగ్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అని పవన్ కొనియాడారు… వైసీపీ ప్రభుత్వంలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదని పవన్ అన్నారు. బెనిఫిట్ షోలు, అధిక ధరలు ఉన్నప్పుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో వస్తాయని పవన్ అన్నారు..అందుకే పుష్పా సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్లు వచ్చాయని పవన్ పేర్కొన్నారు.భారీ అంచనాలు ఉన్న సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా వస్తారు. సినిమా థియేటర్లకు హీరోలు వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. నేను మొదట్లో మూడు సినిమాలకు వెళ్లి పరిస్థితి అర్థం చేసుకొని ఆగిపోయాను. అల్లు అర్జున్ కూడా ఆగిపోయి ఉండాల్సింది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం సాప్ట్ గా వెళ్లి ఉంటే బాగుండేదని పవన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
సినిమా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళ చనిపోవడం బాధాకరం. ఘటన జరగ్గానే సినిమా హీరో లేదా నిర్మాతలు, దర్శకుడు వాళ్ల ఇంటికి వెళ్లి భరోసా ఇవ్వాల్సింది అని పవన్ పేర్కొన్నారు.అల్లు అర్జున్ వెళ్లడం కుదరకపోయినా మిగిలిన వాళ్లు వెళ్లి ఉండాల్సింది.ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి అందరూ మద్దతుగా ఉండాలి. అలా చేయకుండా సమస్య మొత్తం హీరో మీద వేసేశారు. సినిమా అనేది టీమ్ కష్టం. కానీ, ఈ ఘటనలో హీరోని అందరూ ఒంటరిని చేశారని పవన్ పేర్కొన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా రంగాన్ని ఎంతగానో ప్రోత్సహించారు. బెనిఫిట్ షోలకు అధిక ధరలకు అనుమతి కూడా ఇచ్చారు.. ఈవెంట్ లో రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అల్లు అర్జున్ వ్యవహారంలో అలా చేశారని తాను అనుకోవడం లేదని పవన్ అన్నారు. రేవంత్ రెడ్డి అలాంటి నాయకుడు కాదు…. ఆయన నాకు చాలాకాలంగా తెలుసు.. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని తప్పుబట్టలేము.. ఆ స్థానంలో ఎవరున్నా చట్ట ప్రకారం ఫాలో అవుతారుని పవన్ అన్నారు