సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్‌లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన చిత్రం ‘భాషా’. 1995లో వచ్చిన ఈ మాస్ బ్లాక్ బస్టర్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించింది..ఇంతటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ చేయాలని కథ కూడా సిద్ధం చేసుకున్నాడు యంగ్ డైరెక్టర్ వశిష్ఠ..ఈ యంగ్ డైరెక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన ‘బింబిసార’ చిత్రం తో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడిగా వశిష్ఠ కి మంచి గుర్తింపు లభించింది…ఫాంటసీ మూవీస్ కి కేరాఫ్ గా మారిన వశిష్ఠ భాషా సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేసినట్టు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
విశ్వంభర : ట్రోలర్స్ సరైన సమాధానమిస్తా.. వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
భాషా రేంజ్ కథ సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించాల్సిన ఈ చిత్రానికి రజినీకాంత్ కూడా కథ వినగానే ఆసక్తి చూపారట.. కానీ కథలో కొన్ని లోటులు ఉన్నాయని భావించిన వశిష్ట ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిలిపివేసినట్టు వెల్లడించారు. స్టార్ హీరో, బిగ్ ప్రొడ్యూసర్,అదిరిపోయే కథ ఇవన్నీ ఉన్నా కానీ కథలోని కొన్ని లోటు పాట్లు నన్ను పూర్తిగా సంతృప్తి పరచలేదు. అందుకే రద్దు చేసుకున్నాను అంటూ వశిష్ఠ పేర్కొన్నారు. తలైవా తో కనుక వశిష్ఠ ఆ మూవీ చేసుంటే ఇంటర్నేషనల్ లెవల్ లో బాగా పాపులర్ అయ్యేవాడు.. కానీ కుదర్లేదు..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ఠ “ ‘విశ్వంభర’ బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు..షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది..యూవీ క్రియేషన్స్ ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం..
