గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఛాన్నాళ్లకు సోలో హీరోగా రాంచరణ్ నుంచి సినిమా రావడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు..కానీ ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో కే డిజాస్టర్ టాక్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా పేళవమైన సినిమాలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన ఇండియన్ 2 సైతం దారుణంగా ప్లాప్ అయింది..కనీసం రాంచరణ్ సినిమాతోనైనా ఫామ్ లోకి వస్తాడు అనుకుంటే గేమ్ ఛేంజర్ సినిమా కూడా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేకపోయింది..ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు 450కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాడు..దిల్ రాజుకి ఈ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది.. భారీగా నష్టాలు వచ్చాయి..
కలెక్షన్స్ దుల్లగొట్టేస్తున్న “తండేల్”.. సెకండ్ డే కలెక్షన్ ఎంతంటే..?
కానీ అదే సంక్రాంతికి వచ్చిన “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా దిల్ రాజుని సేఫ్ సైడ్ లో పడేసింది.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి దిల్ రాజుకి మంచి లాభాలు తీసుకొచ్చింది..ఇదిలా ఉంటే తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా ఫిబ్రవరి 7న ఓటీటీ లోకి వచ్చింది. అయితే ఓటీటీలో కూడా ఈ మూవీకి ప్రేక్షకుల నుండి ఆశించిన రెస్పాన్స్ రావడం లేదు..
ఓటీటీ రిలీజ్ అయ్యి రెండు రోజులు అయినా ఇండియాలో ట్రెండింగ్ లిస్ట్ టాప్ 10లో ‘గేమ్ ఛేంజర్’నిలువలేకపోయింది.ఓటీటీ రిలీజ్‌కి ముందే ఆన్‌లైన్‌లో HD పైరసీ ప్రింట్ విడుదల కావడంతో దీన్ని ప్రైమ్ వీడియోలో చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీనితో ఓటీటీలో కూడా గేమ్ ఛేంజర్ ప్రేక్షకాదరణ లభించలేదు..