MOVIE NEWS

థియేటర్ లో బెడిసి కొట్టినా.. ఓటిటీలో కుమ్మేస్తున్న కంగువా..!!

ప్రస్తుత పరిస్థితులలో ఒక సినిమా కనీసం రెండు వారాలు థియేటర్స్ లో ఆడటమే గగనం అయిపోతుంది.. అది కూడా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారు..కంటెంట్ తేడా కొట్టిందా ఆ సినిమా వెంటనే థియేటర్స్ నుంచి మాయమైపోతుంది..ప్రస్తుతం చాలా సినిమాలు థియేటర్స్ లో ఆశించినంతగా ఆకట్టుకోకపోయినా ఓటీటీలో మంచి వ్యూస్ ను సంపాదించుకోవడంతో పాటు సరికొత్త రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తున్నాయి. థియేటర్స్ లో దెబ్బేసిన ఓటీటీలో అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి.ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సూర్య నటించిన కంగువా కూడా చేరింది..సూర్య లేటెస్ట్ మూవీ కంగువ. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్బింది.

కథ బాగున్న కథనం లో మిస్ ఫైర్ అవ్వడంతో సూర్య కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది..దీనితో రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది ఈ చిత్రానికి సిరుత్తై శివ దర్శకత్వం వహించారు… సూర్య నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠానీ హీరోయిన్ గా నటించింది..అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..,ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌, స్టూడియో గ్రీన్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. కంగువ సినిమా 3డి టెక్నాలజీలో దాదాపు 10కి పైగా భాషల్లో రూపొందింది.

ఆర్ఆర్ఆర్ : డాక్యుమెంటరీ ట్రైలర్ వచ్చేసింది… తెరవెనుక సీన్స్ అదిరిపోయాయిగా..!!

దాదాపు 350 కోట్లకు పైగా ఖర్చు పెట్టి తీసిన ఈ సినిమా కనీసం 100 కోట్లకు పైగా వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో విమర్శలు రావడంతో చిత్రబృందం సౌండ్ లెవల్ తగ్గించింది. కానీ కంగువ లోని డైలాగ్ కంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఎక్కువ కావడంతో ప్రేక్షకులు నిరాశచెందారు.. ఇటీవల ఓటిటిలోకి వచ్చిన కంగువ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. కంగువ చిత్రం వారంలో 1 బిలియన్ స్టీమింగ్ నిమిషాలను అందుకుంది. థియేటర్స్ లో ఫ్లాప్ అయినా కూడా ఓటీటీలో మంచి ఆదరణ అందుకుంటుంది.ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…

Related posts

దేవర పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పటినుంచంటే..?

murali

నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!!

murali

ఆ సినిమా విషయంలో చాలా బాధ పడ్డా..బాబీ షాకింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment