MOVIE NEWS

ENE Repeat : హిలేరియస్ ఫన్ మరొకసారి.. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది..!!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రౌడీ హీరో విజయ్ దేవరకొండ ని హీరోగా ఎస్టాబ్లిష్ చేస్తూ తరుణ్ తెరకెక్కించిన పెళ్లి చూపులు మూవీ సూపర్ హిట్ అయింది.. మొదటి సినిమాతోనే తరుణ్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు.. ఆ తరువాత తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన రెండో మూవీ “ ఈ నగరానికి ఏ మైంది ?”.. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది..అయితే 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు.

కింగ్డమ్ : రిలీజ్ డేట్ లో కన్ఫ్యూషన్.. నెట్ ఫ్లిక్స్ తో మంతనాలు..!!

కానీ ఇప్పుడు ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిందని చెప్పాలి. లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే అనే కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రీ రిలీజ్ టైమ్ లో సూపర్ కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.కాగా ఈ సినిమాకు సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. హీరో విశ్వక్ సేన్ కూడా ఈ నగరానికి ఏమైంది 2 చేయాలని ఉందని చాలా సార్లు ప్రకటించాడు. దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఈ నగరానికి ఏమైంది 2 ఉంటుందని గతంలో ప్రకటించాడు. అయితే ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తు వస్తున్నారు..

తాజాగా వారి నిరీక్షణకు తెరపడింది.. చిత్ర యూనిట్ తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నగరానికి ఏమైంది 2 ను అఫీషియల్ గా ప్రకటించారు.ఈ సీక్వెల్ ను సురేష్ బాబు తో పాటు ’35 చిన్న కథకాదు’ అనే చిత్రాన్ని నిర్మించిన సృజన్, సందీప్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈNఈ రిపీట్ పేరుతో వస్తున్న ఈ సీక్వెల్ కు వివేక్ సాగర్ మ్యూజిక్ అందిస్తున్నాడు…

Related posts

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

murali

మళ్ళీ అలాంటి స్లాంగ్ లోనే వస్తున్న రాంచరణ్ మూవీ..?

murali

దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా..రాంచరణ్ కీలక నిర్ణయం..!!

murali

Leave a Comment