టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పాన్ ఇండియా వైడ్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ ‘కింగ్డమ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ ఇంటెన్స్ యాక్షన్ పాత్రలో నటిస్తున్నాడు.. ఈ చిత్రం నుండి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ చూసిన ప్రతి ఒక్కరికీ విజయ్ లో సరికొత్త యాంగిల్ కనిపిస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ భారీగా ట్రాన్స్‌ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది..
హరిహర వీరమల్లు : జాతీయ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
ఈ మూవీలో విజయ్ పెర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండనుందట. విజయ్ దేవరకొండ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.. ఇటీవల వరుస వాయిదాలు పడుతున్న ‘కింగ్డమ్’ మూవీ ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసుకుంది.దీనికి సంబంధించి తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను వెల్లడించారు. ఈ ప్రెస్టీజియస్ మూవీ రిలీజ్ డేట్ ప్రోమోను నేడు సాయంత్రం 7.03 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇప్పటికే రిలీజ్ వాయిదాల కారణంగా నిరాశ చెందిన ఫ్యాన్స్ ఇప్పుడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చు కుంటున్నారు.
మొత్తానికి ‘కింగ్డమ్’ మూవీ గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమైంది. కెరీర్ లో అర్జున్ రెడ్డి మినహా ఆ రేంజ్ హిట్ లేని దేవరకొండ ఈ సారి కింగ్డమ్ తో సాలిడ్ హిట్ అందుకునేందుకు సిద్ధం అయ్యాడు..ఈ చిత్రాన్నీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు..
