టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మనం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు.. కానీ హీరోగా అఖిల్ ప్రేక్షకులలో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.. ఎప్పటికైనా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో వున్నాడు..ఇదిలా ఉంటే అఖిల్ ఫ్యాన్స్ అందరికి సడెన్ షాక్ ఇచ్చాడు.. ఎవరికీ తెలీకుండా సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు..
నేడు హైదరాబాద్ లో నాగార్జున ఇంట్లో ఈ నిశ్చితార్ధ వేడుక ఘనంగా జరిగింది.. ఈరోజు ఉదయం ఓ శుభ ముహూర్తాన జుల్ఫీ రావ్‌జీ కుమార్తె ప్రముఖ ఆర్టిస్ట్ ‘జైనబ్ రావ్‌జీ’ చేతికి అఖిల్ ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు.ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని సమాచారం..తాజాగా ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున అధికారంగా ప్రకటించారు. యువ జంటను అభినందించండి అంటూ అక్కినేని నాగార్జున తాజాగా ట్వీట్ చేసారు.దిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ గా ఉంటూనే సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా కూడా పని చేస్తుంది.
నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!
అఖిల్, జైనాబ్ రావ్‌జీ కొన్ని సంవత్సరాల క్రితం కలుసుకోగా అలా వారి పరిచయం ప్రేమగా మారింది.. ఈ యువ జంట కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవల ఇరు కుటుంబ పెద్దలకు తమ ప్రేమను తెలియజేయడంతో అందుకు అక్కినేని ఫ్యామిలీతో పాటు జైనాబ్ ఫ్యామిలీ కూడా అంగీకరించడంతో నేడు నాగార్జున నివాసంలో నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. కొడుకు పెళ్లి కుదరడంతో అక్కినేని నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.అఖిల్ తన జీవితంలో ముఖ్యమైన అడుగు వేస్తున్నాడు..ఒక తండ్రిగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. జైనాబ్ మా కుటుంబంలో అడుగుపెట్టడం మాకెంతో సంతోషంగా ఉందని నాగ్ తెలిపారు.. త్వరలోనే అఖిల్,రావ్‌జీల పెళ్లి తేదీని ప్రకటిస్తామని నాగార్జున తెలిపారు…