మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గత ఏడాది “ దేవర” సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ “ డ్రాగన్ “.. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.. ఎన్టీఆర్ కూడా ఇటీవల ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా ఖరారు అయినట్లు తెలుస్తుంది.. కొన్ని రోజుల క్రితం ఆమె చేసిన ఇన్స్టా పోస్ట్ కూడా ఇందుకు బలం చేకూర్చింది..
K RAMP : కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ లుక్ వైరల్..!!
బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో దానికి తగ్గట్లుగానే ఈ బ్యూటీ పారితోషకం డిమాండ్ చేసినట్లు సమాచారం.. ఈ భామ ఏకంగా కోటిన్నరకు పారితోషకం డిమాండ్ చేసినట్లు సమాచారం..ఎన్టీఆర్ తో నటించనుండటంతో ఈ భామకు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఏర్పడింది.. డ్రాగన్ సూపర్ హిట్ అయితే కనుక ఈ క్యూట్ బ్యూటీ కి టాలీవుడ్ స్టార్స్ నుంచి వరుస ఆఫర్స్ వచ్చే అవకాశం వుంది..
డ్రాగన్ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ కి విడుదల అయ్యే అవకాశం వుంది.. అలాగే ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించిన వార్ 2 సినిమా ఆగస్టు 14 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఈ సినిమాలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుం డగా..కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది..అయాన్ ముఖర్జి తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.
