MOVIE NEWS

వీరమల్లు రిలీజ్ పై సందిగ్దత.. అనుకున్న టైం కి రిలీజ్ అవుతుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా “హరిహర వీరమల్లు”.. ఈ సినిమాను అనౌన్స్ చేసి దాదాపు ఐదేళ్లు అవుతుంది..ఈ సినిమా తర్వాత పవన్ నటించిన ‘భీమ్లా నాయక్,’ ‘బ్రో’ సినిమాలు కూడా రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతుంది.. కానీ “హరిహర వీరమల్లు “ సినిమాకు మోక్షం కలగడం లేదు. ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ.. సినిమా మాత్రం విడుదల కావట్లేదు.ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలెట్టిన ఉత్సాహంలో మేకర్స్ మార్చి 28 న రిలీజ్ డేట్ ప్రకటించారు..

గ్లోబల్ స్టార్ తో భారీ మూవీ సెట్ చేస్తున్న ఆ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్..?

అయితే ఇప్పటికీ చిత్ర యూనిట్ ఈ డేట్‌కే కట్టుబడి ఉంది. నిర్మాత ఏఎం రత్నం చెప్పిన డేట్‌కే వస్తామని ధీమాగా చెప్పారు.కానీ ‘వీరమల్లు’ విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు మార్చి 28కి పవన్ సినిమా రాదన్న ధీమాతో అదే డేట్‌ ను కన్ఫర్మ్ చేసుకొని రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు జోరుగా ప్రమోషన్స్ చేసుకుంటున్నాయి..మార్చి 28న ‘హరిహర వీరమల్లు’ వస్తుందని నమ్మకంగా వున్న ఫ్యాన్స్ సైతం ఈ సినిమా రిలీజ్ పై ఆశలు వదులుకున్నారు…

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న సినిమాకు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది.. దీనితో ఈ సినిమా వాయిదా పడుతుందని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.ఐతే ఇప్పుడు రిలీజ్ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేస్తారా అని ఫ్యాన్స్ మళ్ళీ ఆందోళన చెందుతున్నారు..అయితే ఈ సినిమా పూర్తి కావడానికి ఇంకో వారం రోజుల పాటు పవన్ షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉందని తెలుస్తుంది..దీనితో ఈ సినిమా షూటింగ్ అవ్వడానికి మరి కాస్త టైం పట్టే అవకాశం ఉంది..

 

Related posts

తండేల్ : ప్రీలూడ్ వీడియో రిలీజ్..ట్రైలర్ పై అంచనాలు పెంచేసిందిగా..!!

murali

దేవర రికార్డుల ఊచకోత మొదలు

filmybowl

“గేమ్ ఛేంజర్” ఈవెంట్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్.. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్..!!

murali

Leave a Comment