తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ ప్రారంభంలో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన శంకర్ తమిళ్ స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు.. ఆయన సినిమా వచ్చిందంటే అప్పట్లో ఓ సంచలనమే.. కమల్ హాసన్, రజనీ కాంత్ వంటి స్టార్స్ తో సినిమాలు చేసి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు.. అయితే శంకర్ తెరకెక్కించే ప్రతి సినిమాలో ప్రేక్షకులకి ఓ సందేశాన్ని అందిస్తారు.. ఎప్పటికైనా ఇండియా అభివృద్ధి చెందితే చూడాలని దర్శకుడు శంకర్ కోరిక.. ప్రస్తుతం శంకర్ డౌన్ ఫాల్ అయ్యారు.. ఆయన తెరకెక్కించిన గత సినిమాలేవి కూడా ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోవడం లేదు.
సంక్రాంతికి వస్తున్నాం : ప్రమోషన్స్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న ” వెంకీ మామ”
ఇటీవల లోక నాయకుడు కమల్ హాసన్ తో తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకులని అంతగా అలరించలేదు.. కమల్ కెరీర్ లోనే బిగ్గెస్గ్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో శంకర్ తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ పై బాగా ఎఫెక్ట్ పడింది.. అయితే గ్లోబల్ స్టార్ రాంచరణ్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది..ఇదిలా ఉంటే రాంచరణ్ సినిమా ప్రమోషన్ లో శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు.తను ‘వేల్ పరి’ అనే సినిమాను తెరకెక్కించడమే కలగా పెట్టుకున్నట్లు శంకర్ తెలిపారు వేల్ పరీ అనేది ఒక యుద్ధ వీరుడి కథ. తమిళనాడులో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమానే ‘వేల్ పరి’.
తాజాగా ‘గేమ్ ఛేంజర్’ ప్రమోషన్స్‌లో ‘వేల్ పరి’ గురించి అప్డేట్ అందించాడు శంకర్. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ముగిసిందని తెలిపారు.తను ఎవరైనా అందమైన హీరోను చూసిన ప్రతీసారి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో వారే హీరో అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తానని అన్నారు.. అలా చాలామంది పేర్లు నోట్ చేసి పెట్టుకున్నట్లు ఆయన బయటపెట్టాడు.వేల్ పరి’లో సూర్యను హీరోగా తీసుకుంటే బాగుంటుందని శంకర్ అనుకుంటున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే ‘కంగువా’ అనే మూవీతో సూర్య ఎదురుదెబ్బ తిన్నాడు. అందుకే ఒకవేళ ‘వేల్ పరి’ కోసం తనను అప్రోచ్ అయినా కూడా సూర్య ఒప్పుకుంటాడనే నమ్మకం చాలామంది ప్రేక్షకులకు అయితే లేదు