MOVIE NEWS

బాలయ్య ‘డాకు మహారాజ్ ‘లో హైలెట్ సీన్స్ ఏంటో తెలుసా..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఆయన  నటించిన లేటెస్ట్ మాస్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. బాలయ్య ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోతో అదరగొడుతున్నాడు .హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. స్టార్ మ్యూజిక్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ : స్టోరీ రివీల్ చేసిన శంకర్.. ఈ సారి గట్టిగానే ప్లాన్ చేసాడుగా..!!

సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది… ఇక తాజగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు ఈ నెల 23న అంటే నేడు చిన్ని అనే సాగే లిరికల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఇయర్ కానుకగా స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం..

ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ నిలుస్తుందని సమాచారం.బాలయ్య – ప్రగ్యా జైస్వాల్, ఓ చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఆ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని సమాచారం..ఇదిలా ఉంటే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ చాందినీ చౌదరి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ జనవరి 4న డల్లాస్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు.

Related posts

డాకు మహారాజ్ : బాలయ్య సినిమాలో సర్ప్రైజింగ్ గెస్ట్ రోల్స్..!!

murali

భారీ రికార్డ్ కి అడుగు దూరంలో పుష్ప 2..ఆ రికార్డ్ ని బ్రేక్ చేస్తుందా..?

murali

భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment