MOVIE NEWS

రెండు తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా..?

ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా “పుష్ప 2 “..ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు… ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో పుష్ప మేనియాపై ప్రేక్షకులలో సూపర్ బజ్ కలిగించేందుకు మేకర్స్ భారీగా ప్రమోషన్స్  చేస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ కోసం బన్నీ ఎంతగానో కష్టపడుతున్నారు. ప్రతి ఈవెంట్ లో కూడా స్పెషల్ గా పాల్గొంటూ సినిమాపై ప్రేక్షకులలో సరికొత్త హైప్ క్రియేట్ చేస్తున్నారు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా ఈవెంట్ ఎక్కడ పెట్టినా కానీ భారీగా ప్రేక్షకులు వస్తున్నారు.. దీనితో ప్రమోషనల్ ఈవెంట్స్ బాగా సక్సెస్ అవుతున్నాయి.ఇదిలా ఉండగా మరోవైపు పుష్ప టీం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు క్లోజ్ అయింది..పుష్ప 2 సినిమా తెలుగు రాష్ట్రాలలో భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

తాజాగా సమాచారం ప్రకారం.. ఇతర రాష్ట్రాల కంటే తెలుగు రాష్ట్రాలలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అవ్వాలంటే గతంలో ప్రభాస్ క్రియేట్ చేసిన భారీ రికార్డులను బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ సినిమాకి ఆంధ్రాలో రూ.90 కోట్లు, సీడెడ్ లో రూ.30 కోట్లు, నైజాంలో రూ.100 కోట్ల రైట్స్ కి సంబంధించిన డీల్ పూర్తయినట్లు తెలుస్తుంది..మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకి దాదాపు రూ.220 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాలలో రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా రూ.415 కోట్ల హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో బాహుబలి 2 సినిమా ఏకంగా రూ.330 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది..ప్రస్తుతం పుష్ప సినిమా వీటికి మించి కలెక్షన్స్ సాదించాల్సి వుంది..

Related posts

గేమ్ ఛేంజర్ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. టికెట్స్ రేట్స్ భారీగా పెంపు..!!

murali

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న రాంచరణ్..”గేమ్ ఛేంజర్” ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్ ..!!

murali

Leave a Comment