Gunturu kaaram Devara : ఈ సంవత్సరం లో కల్కి 2898 AD తర్వాత మళ్లీ ఆ రేంజ్ లో జోరు చూసిన సినిమా దేవరా . కంప్లీట్ నెగిటివిటీ థో షో పడక ముందు నుంచి ట్రోల్స్ ఎదుర్కున్న సినిమా బెనిఫిట్ షో పాడిన దెగ్గర నుంచి జోరు తగ్గకుండా విజయం సాదించి ఇప్పుడు అయిదు వందల కోట్ల గ్రాస్ ని దాటే దిశగా పరుగులు పెడుతున్నది.
ముందు రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచే తెలుగు రాష్ట్రాలు అన్నింటిలోనూ ప్రీమియర్లు వేయాలని చిత్ర బృందం నిర్ణయిచుకున్నప్పుడు చాలా మంది నుంచి చాలా కామెంట్స్ వచ్చాయి. టాక్ ఏ మాత్రం తేడా అయినా సినిమా కి దెబ్బ పడుతుందని ట్రేడ్ టెన్షన్ పడింది. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా ధైర్యంగా ముందు నిర్ణయించిన టైమ్ కే షో వేసింది
ఇంకేముంది ఈ అనుమానాలకు చెక్ పెడుతూ దేవర అనూహ్యంగా దూసుకుపోవడంతో పాటు రికార్డు కలెక్షన్ల వర్షం కురిసింది. దీని గురించి నాగవంశీ మాట్లాడారు.
గుంటూరు కారం ( Guntur Kaaram )కు ఇలాగె ముందస్తు షోలు వేయడం వల్లే మైనస్ అయ్యిందని, వాటి వల్లే టాక్ తేడా వచ్చిందని భావించామని కానీ ఇలాంటి ఎర్లీ ప్రీమియర్లు ఫలితం సినిమా మీద ఎలాంటి ప్రభావం చూపించవని ఆ విషయాన్ని దేవర ( devara ) ప్రూవ్ చేసిందని, ఈ విషయంలో తమ ఆలోచన తప్పని ఇక పైన ఎలాంటి అనుమానాలు పెట్టుకోకూడదని అన్నారు .
నిర్మత వంశీ చెప్పిన దాంట్లోను నిజం వుంది. గుంటూరు కారం సినిమా గురించి చర్చ తేడగా వచ్చింది కానీ దానికి కారణం వేరు.
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అంచనాలు విపరీతంగా ఉంటాయి. ఆ అంచనాలని మించే రీతిలో కథ కథనం లేకపోవడం తో అభిమానులే ఒప్పుకోలేకపోయారు. ఫలితంగా సినిమా రన్ అనేది యావరేజ్ టాక్ తో మొదలయ్యింది.
Read Also : విశ్వంబర సినిమా టీజర్ : అబ్బురపరిచే దృశ్యాలు మెగాస్టార్ ఈజ్ బ్యాక్
ఒకవేళ గుంటూరు కారంకు దేవర రేంజ్ లో టాక్ ఉండుంటే గతంలో నాగవంశీ చెప్పినట్టు అన్ని కాకపోయినా నాన్ రాజమౌళి రికార్డులు కొన్నయినా ఈ సినిమా ఖాతాలో పడేవి
ఈ సినిమాకు సంబంధించి టాక్ ఏంటి ప్రేక్షకుల రియాక్షన్ ఏంటి అని చిత్ర బృందానికి తెలియడంతో సినిమా కి సక్సెస్ మీట్ చేయలేదు. దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు బయట కనిపించేందుకు ఇష్టపడలేదు.
దేవర సినిమా వల్ల కలిగిన మరో ప్రయోజనం ఏంటంటే. రాబోయే రోజుల్లో పుష్ప 2, గేమ్ ఛేంజర్, బాలయ్య 109, విశ్వంభర లాంటి పెద్ద సినిమాలన్నీ అర్ధరాత్రి షోలకు కత్చితంగా వస్తాయి రికార్డ్స్ కొట్టేస్తాయి. దీని వల్ల ఓపెనింగ్స్ భారీగా వస్తుండడం తో పాటు వీటికి పాజిటివ్ టాక్ వస్తే వచ్చే డబ్బులు పెద్ద ఎత్తున వస్తాయి. ఈ కోణంలో దేవర అందరికి కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టే.
Follow us on Instagram