Director Ajay bhupathi next confirmed
MOVIE NEWS

అజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ హీరో తో సినిమా కాన్ఫమ్డ్.

Director Ajay bhupathi next confirmed
Director Ajay bhupathi next confirmed

Director Ajay bhupathi next : అజయ్ భూపతి దర్శకత్వం లో వచ్చిన ‘RX 100’ రిలీజై అప్పట్లో ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఆ సినిమా పాటలూ, సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియా లో కనిపిస్తూనే వుంటాయి. ఆ తర్వాత వచ్చిన మహాసముద్రం అనుకున్న రేంజ్ లో ఆడకపోయినా అజయ్ డైరెక్షన్ కి వంక పెట్టలేం.

ఇక 2023లో ఆయన పాయల్ రాజపుత్ తో రెండో సారి జత కట్టి తీసిన ఎరోటిక్ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘మంగళవారం’ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే ఈ ఏడాది భారత్ తరపున ఆస్కార్‌కి నామినేట్ చేసే సినిమాల జాబితాలో ఈ మూవీని పరిశీలించినా..

ఆ అదృష్టం బాలీవుడ్ ఫిల్మ్ ‘లాపతా లేడీస్‌’ తన్నుకుపోయింది. కాగా నెక్స్ట్ అజయ్ తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్‌తో ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేశాడు, ఇక షూటింగ్ మొదలు పెట్టడమే తరువాయి అని అన్నారు ఏమైంది ఏమో కానీ ఇప్పుడు అజయ్ మాత్రం తొందర్లోనే వేరే హీరోతో ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇంతకీ ధృవ్ ప్రాజెక్ట్ ఏమైంది.. ఇంకో హీరో ఎవరంటే..

మంగళవారం లాంటి థ్రిల్లర్ హిట్ తరువాత డైరెక్టర్ అజయ్ భూపతి.. పెదకాపు ఫేమ్ హీరో విరాట్ కర్ణ తో ఒక రగ్డ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా షూట్ కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం.

Also Read :  మరో సారి హార్రర్ థ్రిల్లర్ సినిమాలో ఆ హీరో…. ఈ సారి గురి పాన్ ఇండియా

అయితే తమిళ్ యంగ్ సెన్సేషన్ ధృవ్ విక్రమ్ తో ఒక బైలింగ్వల్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఆ వార్తల్లో నిజమున్న.. మూవీ ఆగిపోయినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఎంతో ఎక్సైట్ అయినా ఫ్యాన్స్ ఇప్పుడు కాస్త డీలా పడ్డారు. అయితే విరాట్ కర్ణతో చేస్తున్న ప్రాజెక్ట్‌తో అజయ్ మళ్ళీ ఎం మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.

మరోవైపు పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో బోల్డ్ కథాంశంతో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’. అన్ని వర్గాల ప్రేక్షకులని, విమర్శకులని, తెలుగు పరిశ్రమ దిగ్గజాలని కూడా ఆకట్టుకుని థియేటర్లలో మంచి విజయంతో కంటెంట్ ఉన్న చిత్రాల బలం చూపించింది ఈ చిత్రం. జాతీయ, అంతర్జాతీయ వీక్షకుల నుండి ఓటీటీలో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది.

Follow us on Instagram

Related posts

అఖండ 2 తాండవం…. అదరహో….

filmybowl

అల్లు అర్జున్ : ఆ సినిమా ప్లాప్ అనేసరికి చాలా బాధపడ్డా..!!

murali

గేమ్ ఛేంజర్ : ట్రైలర్ రిలీజ్ వాయిదా.. మండిపడుతున్న ఫ్యాన్స్..?

murali

Leave a Comment