Dil raju gives chance to that Cult talented director
MOVIE NEWS

ఆ టాలెంటెడ్ దర్శకుడికి దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడట

Dil raju gives chance to that Cult talented director
Dil raju gives chance to that Cult talented director

Dil Raju : దిల్ రాజు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. తనకి ఏమి లేకున్నా ఇక్కడ వరకు వచ్చా అని గర్వం గా చెప్పుకునే వ్యక్తి.

ఆయన సినిమా ప్రొడక్షన్ లో కి దిగక ముందు డిస్ట్రిబ్యూటర్ గానే సినీ జీవితం ప్రారంభించాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు సక్సెసఫుల్ గాని అప్పట్లో అంటే మొదట్లో ఊహించని దెబ్బలు చాలానే తగిలాయి. ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడు.

కానీ ఆయనని డిస్ట్రిబ్యూటర్ గా నిలదొక్కుకునేలా చేసిన సినిమాల గురించి ఆయన ఎప్పుడు మార్చిపోలేదు. 

తొలి ప్రేమ, ఆది తనని ఎలా నిలబెట్టాయో ఆయనను మళ్ళీ ఒక ట్రాక్ లో కి ఎలా తెచ్చాయో సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తానే వుంటాడు. ఆయనని

తొలిప్రేమ అనే సినిమా ఎంతగా నిలబెట్టిందో, ఎన్ని సార్లు లాభాలు తెచ్చి పెట్టింది అంటే దిల్ రాజు కి ఏదైనా ఒక సినిమాతో నష్టం వస్తే అప్పట్లోనే మళ్ళీ తొలిప్రేమను రీ రిలీజ్ చేసి ప్రాఫిట్స్ సాధించే వాడంట ఈ విషయాన్ని స్వయంగా మొన్నటి తొలిప్రేమ సిల్వర్ జూబ్లీ మీట్ లో ఆయనే తెలిపారు.

తొలిప్రేమ విజయాన్ని దిల్ రాజు ఎంతగా గుర్తు పెట్టుకున్నాడో తెలుగు ప్రేక్షకులు కూడా అంతే గుర్తు పెట్టుకున్నారు. చాలా మందికి అది వాళ్ళ జీవితం అన్నట్టు.

ఇక ఆ చిత్రాన్ని తీసిన దర్శకుడు కరుణాకరన్ తో రాజు కి మంచి సంబంధాలు ఉన్నాయి కానీ వీళ్ళ కలయిక లో సినిమా అయితే రాలేదు. అయితే ప్రస్తుతం ఆ దర్శకుడి కి రాజుగారు సినిమా కమిట్ అయినట్టు తెలుస్తోంది.

దిల్ రాజు సోదరుడి కొడుకు ఆశిష్ రెడ్డి కోసమే ఒక కథను సిద్ధం చేయమన్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరం లో ఈ కాంబినేషన్ పై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎంతైనా ఉంది.

Read Also : మట్కా నుంచి లే లే రాజా సాంగ్ విడుదల

అయితే దర్శకుడు కరుణాకరన్ అస్సలు ఫామ్ లో లేడు హిట్టు కొట్టి చాలా కాలమైంది. 2010లో ప్రభాస్ తో చేసిన డార్లింగ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత రామ్ తో చేసిన ఎందుకంటే ప్రేమంట , నితిన్ తో తీసిన చిన్నదాన నీకోసం, సాయి దుర్గ తేజ్ తో చేసిన తేజ్ ఐ లవ్ యు.. సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

ఆ తరువాత ఏ నిర్మాత కూడా కరుణాకరన్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదు. కానీ దిల్ రాజు మాత్రం కరుణాకరన్ మీద ఎంతో నమ్మకంతో కథ సిద్ధం చేసుకోమ్మని చెప్పాడట. అన్ని ఓకే అనుకుంటే దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది.

Follow us on Instagram

Related posts

ఇంకో ఐదేళ్లు రాజమౌళి జైల్లోనే మహేష్.. నిరాశలో ఫ్యాన్స్..!!

murali

పుష్ప 2 : ఆ సీన్ చూసాక రాజమౌళిని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్.. కారణం అదేనా..?

murali

ప్రభాస్ సినిమాను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోయిన్..?

murali

Leave a Comment