MOVIE NEWS

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్.. లేదంటే పరిస్థితి ఎలా ఉండేదో..?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంది.. కానీ ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా ఈ సినిమా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించింది..

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత దాదాపు ఆరేళ్లకు ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడంతో దేవర సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. మూడు నెలల క్రితం హైదరాబాద్ లో జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేసినప్పుడు అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. నిజానికి బాద్షా సినిమా టైంలో ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి ఓపెన్ గ్రౌండ్స్ వేడుకలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు..ఇతర హీరోల సినిమాలకు గెస్టుగా వెళ్ళాడు తప్పించి హీరోగా చేసిన సినిమాలకు మాత్రం అవుట్ డోర్ ఈవెంట్స్ లేకుండా చూసుకున్నాడు.

బన్నీ అరెస్ట్ విషయంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన న్యాచురల్ స్టార్..!!

అందులో భాగంగానే నోవాటెల్ లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయగా భారీ ఫ్యాన్స్ తాకిడి కారణంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిలయ్యింది. బయట వేరే ఊరిలో ఎక్కడైనా పెట్టమని ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ఎంత ఒత్తిడి చేసినా కానీ ఎన్టీఆర్ అస్సలు ఒప్పుకోలేదు. దీనితో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ని ఏమనలేక ట్విట్టర్ లో కళ్యాణ్ రామ్ ని నిందించారు.ఆ సమయంలో ఎన్టీఆర్ కఠినమైన కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు.లేకుంటే భారీ జన తాకిడిలో ఏ చిన్న దుర్ఘటన జరిగినా కూడా వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో పుష్ప 2 సినిమా నిరూపించింది. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూడాలని తీసుకున్న నిర్ణయం అల్లుఅర్జున్ ని జైలు మెట్లు ఎక్కించింది. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం బన్నీకి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసింది.

Related posts

అడ్వాన్స్ బుకింగ్స్ లో జోరు చూపిస్తున్న పుష్పరాజ్..భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..!

murali

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

murali

పుష్ప 2 : రిలీజ్ సమయంలో నాగబాబు సంచలన ట్వీట్..!!

murali

Leave a Comment