MOVIE NEWS

బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..?

బాలీవుడ్ లో ఇటీవల రిలీజ్ అయిన “ఛావా” సంచలనం సృష్టిస్తుంది.. విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.. ఈ సినిమాకి అన్ని భాషల ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఏకంగా 555 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.ఇదిలా ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఛావా సినిమాని గీత ఆర్ట్స్ సంస్థ డబ్బింగ్ చేసి గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది.

the paradise : టీజర్ తో ఫ్యాన్స్ కి బిగ్ షాక్ ఇవ్వబోతున్న నాని..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు ప్రేక్షకులకి ఒక సూపర్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. హీరో విక్కీ కౌశల్ పాత్రకి జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నాడు అనే వార్త గత నాలుగు ఐదు రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది… అయితే అది కేవలం గాసిప్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తయిందని ఎన్టీఆర్ దానికి డబ్బింగ్ చెప్పలేదని సమాచారం. దీనితో కేవలం ఇది ఒక ప్రచారంగానే మిగిలిపోయింది…

అయితే ఎవరు డబ్బింగ్ చెప్పారనేది సినిమా రిలీజ్ అయితే గాని ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుంది..ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటన అద్భుతంగా ఉందని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఔరంగజేబు పాత్రలో నటించిన అక్షయ్ ఖన్నా నటనకు కూడా ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. అలాగే రష్మిక కూడా ఈ సినిమాలో అద్భుతంగా నటించిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు

 

Related posts

తారక్ నటనకు ఆ హాలీవుడ్ డైరెక్టర్ ఫిదా.. ఒక్క సినిమా చేయాలని ఉందంటూ..!!

murali

ప్రభాస్ ‘రాజసాబ్’ టీజర్ రన్ టైం లాక్..!!

murali

వస్తున్నాం.. దుల్లగొడుతున్నాం.. తండేల్ సక్సెస్ గ్యారెంటీ అంటున్న గీతా ఆర్ట్స్..!!

murali

Leave a Comment