టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. నాగవంశీ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. తాను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలను ఓ రేంజ్ లో లేపడం నాగవంశికి అలవాటు.. ఆ సినిమా హిట్ అయితే ఒకే.. కానీ ప్లాప్ అయినా లేదా సరిగ్గా ఆడకపోయినా వెంటనే గాలి తీసేస్తాడు.. తాజాగా దేవర విషయంలో కూడా నాగావంశీ ఇదే చేసాడు..
సెల్ఫీ ఇచ్చి ఫోన్ తీసుకున్న రాంచరణ్..ఫన్నీ మూమెంట్.. వీడియో వైరల్..!!
దేవర రిలీజ్ కు ముందు నాగావంశీ ఇచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.. దేవరతో ఎన్టీఆర్ విధ్వంసం చూస్తారు.. ఆరేళ్ళ ఫ్యాన్స్ నిరీక్షణని దేవర తీరుస్తుంది అని.. దేవర గ్లోబల్ వైడ్ భారీ కలెక్షన్స్ సాధిస్తుందని నాగావంశీ చేసిన ప్రమోషన్ సినిమాకి బాగానే ఉపయోగపడింది.. రిలీజ్ రోజు సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ క్రేజ్ కారణంగా దాదాపు 550 కోట్ల కలెక్షన్స్ సాధించి కొరటాలను సేఫ్ జోన్ లో పడేసింది.. అయితే దేవర రిలీజ్ అయినా ఛాన్నాళ్లకు నాగవంశీ తన ఓన్ రివ్యూ ఇచ్చారు..
దేవర సినిమాని తాను ఎంతగానో ఉహించుకున్నానని ఫస్ట్ హాఫ్ అదిరిపోతుంది.. ఇంటర్వెల్ బ్యాంగ్ మైండ్ బ్లోయింగ్ గా వుంది.. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఆ రేంజ్ లో లేదు..క్లైమాక్స్ ట్విస్టు బాగున్నా ఏదో మిస్ అయిన ఫీలింగ్ వచ్చినట్లు ఉందని తెలిపారు.. ప్రస్తుతం నాగవంశీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..దేవర సినిమా లో తనకి ఎన్టీఆర్ గారి నటన ఎంతగానో నచ్చిందని.. ఇక అనిరుధ్ మ్యూజిక్ వండర్ఫుల్ అని నాగావంశీ కామెంట్స్ చేసారు.. తన అప్ కమింగ్ మూవీ డాకు మహారాజ్ గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను నాగవంశీ తెలిపారు.. బాలయ్య నట విశ్వరూపం డాకు మహారాజ్ లో చూస్తారని సినిమాకి తనదైన శైలిలో నాగావంశీ హైప్ ఇచ్చుకుంటూ వచ్చారు.