MOVIE NEWS

బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..?

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ “ డాకు మహారాజ్ “.. స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూసర్ నాగవంశీ గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.. అలాగే శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెలా, చాందిని చౌదరి ముఖ్య పాత్రలలో నటించారు.. ప్రస్తుతం బాలయ్య తన తరువాత సినిమాను తనకి మూడు సూపర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య మరో బిగ్గెస్ట్ మూవీ చేస్తున్నాడు..

పుష్ప 2 : ఓటీటీ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

గతంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ అఖండ “ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమాకు ఇప్పుడు మేకర్స్ సీక్వెల్ ప్రకటించారు. “అఖండ 2 : తాండవం” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది.. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా వుంటే తనకి వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన గోపీచంద్ మలినేని తో బాలయ్య మరో సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు.. ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవరకు అనిరుధ్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాలోని సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో పాటు ఈ సినిమా బీజీఎంకు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య కొత్త మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అనే న్యూస్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. బాలయ్య మూవీకి అనిరుధ్ బీజీఎంతో బాక్సాఫీస్ షేక్ అవడం పక్కా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు…అయితే బాలయ్య గత సినిమాలన్నిటికి తమన్ స్పీకర్స్ పగిలిపోయే విధంగా బిజిఎం ఇచ్చి అదరగొట్టాడు.. అలాంటి తమన్ ని కాదని అనిరుధ్ కి ఛాన్స్ ఇవ్వటం పట్ల బలమైన కారణం ఉన్నట్లు సమాచారం..

Related posts

అఖండ 2 తాండవం.. సాయంత్రమే బిగ్ అప్డేట్..!!

murali

బాహుబలి తర్వాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.. తమన్నా షాకింగ్ కామెంట్స్..!!

murali

స్పిరిట్ : మూగవాడిగా ప్రభాస్.. ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

murali

Leave a Comment