Dhrushyam will be back next year
MOVIE NEWS

దృశ్యం – ది కంక్లూషన్

Dhrushyam will be back next year
Dhrushyam will be back next year

Dhrushyam : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ది బెస్ట్ థ్రిల్లర్స్ అంటూ లిస్టు తీస్తే దాంట్లో మలయాళ సినిమా ‘దృశ్యం’ అగ్ర భాగాన ఉంటుంది. భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒకళ్ళు ఈ సినిమా ను తెగ ఆదరించారు.

మలయాళంలో దృశ్యం బ్లాక్ బస్టర్ అయ్యాక ఈ సినిమా ని వివిధ భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ ) ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. బాష తో సంబంధం లేకుండా యాక్టర్ డైరెక్టర్ ఎవరా అని చూడకుండా తీసిన ప్రతి చోట పెద్ద విజయం సాధించింది.

లోకల్ భాషల్లోనే రీమేక్ అయి అన్నిట్లో ప్రేక్షకుల్ని మెప్పించడమే ఆశ్చర్యం అయితే విదేశీ భాషల్లో సైతం ఈ చిత్రం రీమేక్ అయి మంచి ఫలితాన్ని అందుకోవడం విశేషం.

ఆల్రెడీ ‘దృశ్యం’కు కొనసాగింపుగా మోహన్ లాల్-జీతు జోడీ సీక్వెల్ ‘దృశ్యం-2’ తీస్తే అది కూడా అద్భుత స్పందన తెచ్చుకుంది. నేరుగా ఓటీటీలో రిలీజై కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది అంటే ఈ సిరీస్ కి ప్రజలు ఎంతలా బ్రహ్మరథం పెట్టారో తెలుస్తుంది.

దీనికి కొనసాగింపుగా ఇప్పుడు ‘దృశ్యం-3’ కూడా ఉంటుందనే సంగతి అప్పుడే ఖరారైంది. ఇప్పుడీ సినిమాను ఆఫిషియల్ గానే ప్రకటించారు. వచ్చే ఏడాది చివర్లో దృశ్యం-3’ ప్రేక్షకుల ముందుకు వస్తుందట.

Read Also : రామాయణాన్ని ఇలా వాడేశారు

మలయాళ ఇండస్ట్రీ సినిమాలన్నీ క్వాలిటీ తో ఎక్కువ టైం తీసుకోకుండా చక చక తీస్తుంటారు. ప్రస్తుతం మోహన్ లాల్, జీతు జోసెఫ్ వేర్వేరు కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడం తో. వచ్చే సంవత్సరం ఈ దృశ్యం-3ని సెట్స్ మీదికి తీసుకొని వెళ్లి క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకి తెస్తారని మీడియా వర్గాలకి తెలియచేసారు.

ఐతే ఈసారి దృశ్యం కథను ఇంతటితో కంప్లీట్ చేయనున్నారు. ఇంకో పార్ట్ అంటే ప్రేక్షకులు కి సాగతీత వ్యవహారం అనిపిస్తుందని అనుకున్నారో ఏమో గాని మూడో పార్ట్‌తో సినిమాను ముగించేయాలని లాల్, జీతు ఫిక్సయ్యారట. అందుకే టైటిల్ కూడా అదే తెలియచేస్తుంది

Follow us on Instagram

Related posts

బాలయ్య “డాకు మహారాజ్ ” ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే..?

murali

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ అంతా ఇంటి పేరు కోసమేనా..?

murali

మెగాస్టార్ తో సినిమా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment