MOVIE NEWS

మైత్రీకి దూరంగా దేవిశ్రీ.. ఆ సినిమాలు సైతం మిస్ కానున్నాయా..?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇప్పటి వరకు తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ని అందించారు..దాదాపు స్టార్ హీరోలందరికీ అదిరిపోయే ఆల్బమ్స్ అందించి దేవిశ్రీ రాక్ స్టార్ గా మారారు.అయితే పుష్ప 2 విషయంలో దేవిశ్రీకి ఘోర అవమానం జరిగింది.టైం కి సాంగ్ ఇవ్వలేదు, బిజిఎం ఇవ్వలేదని పుష్ప మేకర్స్ దేవిశ్రీ ప్లేస్ లో మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని నియమించుకున్నారు.దీనితో ఆ విషయంలో దేవిశ్రీ బాగా హర్ట్ అయ్యాడు.నిన్న చెన్నై లో పుష్ప 2 మూవీ భారీ ఈవెంట్ జరిగింది.ఆ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ స్పీచ్ ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

ఇలాంటి బిగ్గెస్ట్ ఈవెంట్ లో నేరుగా నిర్మాతలను ఉద్దేశించి ఒక సంగీత దర్శకుడు తన అసంతృప్తిని వెళ్లగక్కడం ఇదే మొదటిసారి.బీజీఎమ్ బాధ్యతలు వేరొకరికి అప్పజెప్పడం పట్ల తాను ఎంత రగిలిపోతున్నాడో దేవి నిన్నటి స్పీచ్ ద్వారా వారికి స్పష్టం చేశాడు. సినిమా విడుదలయ్యాక దేవిశ్రీ పనితనం తెలుస్తుంది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.అయితే దేవిశ్రీ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్ గా మారింది.తనకి అవకాశాలు త్వరలో పూర్తిగా తగ్గనున్నాయని అంతా అనుకుంటున్నారు.

హిందీలో మరో మూవీకి సిద్దమవుతున్న ఎన్టీఆర్..దర్శకుడు ఎవరంటే ..?

మైత్రి మూవీస్ బ్యానర్ లోనే దేవిశ్రీ ప్రసాద్ ఇంకో రెండు సినిమాలకు పని చేస్తున్నాడు. వాటిలో మొదటి సినిమా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి గబ్బర్ సింగ్ రేంజ్ హిట్ ని రిపీట్ చేసే ఉద్దేశంతో కోరి మరీ దేవిని తన సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకున్నారు. రెండోది మైత్రి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న రాంచరణ్ ,సుకుమార్ కాంబో మూవీ.. వచ్చే ఏడాది గ్రాండ్ గా ప్రారంభం కానున్న ఈ పాన్ ఇండియా మూవీకి డిఎస్పిని తీసుకున్నారు. ఉస్తాద్ మూవీ షూటింగ్ ఇంకా చాలా భాగం  పెండింగ్ లో వుంది.అలాగే రాంచరణ్ సుకుమార్ కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది. దీనితో మైత్రి అధినేతలు దేవిశ్రీని కొనసాగిస్తారా.. అనేదే ప్రశ్నగా మారింది.

Related posts

వార్ 2- ఎన్టీఆర్ , హృతిక్ తో పాటు మరో ఇద్దరు బడా హీరోలు ?

filmybowl

మేనల్లుడు కోసం రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి..!!

murali

బాలయ్య మూవీపై నాగవంశీ హైప్ మాములుగా లేదుగా.. ఫ్యాన్స్ కి పూనకాలే..!!

murali

Leave a Comment