యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ “ తండేల్ “.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించాడు.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “ప్రేమమ్”, “సవ్యసాచి” వంటి సినిమాలు మంచి విజయం సాధించాయి..దీనితో “తండేల్ “ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పన లో బన్నీ వాసు భారీ స్థాయిలో నిర్మించారు.శుక్రవారం(ఫిబ్రవరి 7 న)ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మత్స్యకారుడి పాత్రలో నాగ చైతన్య కనిపించగా అతని ప్రేయసి గా సాయి పల్లవి నటించారు.దర్శకుడు చందూ మొండేటి నాగచైతన్య, సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు..గాఢంగా ప్రేమించుకున్న ఆ జంట అనూహ్యం సంఘటన మూలంగా ఎడబాటుకు గురి అవుతుంది. వారు తిరిగి ఎలా కలుసుకున్నారనేది ఈ ‘తండేల్’ కథ.
NTR -NEEL : భారీ లొకేషన్స్ లో షూటింగ్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా..!!
ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు చూపించాడు..తండేల్ సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు… నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు.ఫస్ట్ హాఫ్ అద్భుతంగా సాగగా సెంకడాఫ్‌లో సినిమా కాస్త స్లో ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే చివర 20 నిమిషాలు మాత్రం దర్శకుడు చందు మొండేటి తన మార్క్ చూపించాడు..అయితే ఈ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం ప్రధాన కారణం అని చెప్పొచ్చు..
తండేల్ మూవీకి దేవిశ్రీ పాటలు బ్యాక్ బోన్‌గా నిలిచాయి…ఈ మధ్య కాలంలో దేవిశ్రీ బెస్ట్ మ్యూజిక్ సినిమా కూడా ఇదే. పుష్ప-2 సినిమాకు మించిన మ్యూజిక్ దేవిశ్రీ తండేల్ సినిమాకు అందించాడు.ఈ సినిమా విడుదలకు ముందు వరకు దేవి శ్రీ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే ప్రేమకథలకు దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చే మ్యూజిక్ వేరే లేవల్లో ఉంటుంది. గతంలో వచ్చిన ఉప్పెన సినిమాకు సైతం దేవిశ్రీ మ్యూజిక్ ప్లస్ గా మారింది..దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసారు… తండేల్ సినిమాకు ఈ రేంజ్ లో క్రేజ్ రావడానికి దేవిశ్రీ నే కావడం విశేషం..దేవిశ్రీ మ్యూజిక్ కనుక లేకుంటే సినిమా ఫలితం వేరుగా ఉండేది..