Devi SriPrasad discloses pushpa 2 highlights
MOVIE NEWS

పుష్ప 2 గురించి దేవి మాటల్లో..

Devi SriPrasad discloses pushpa 2 highlights
Devi SriPrasad discloses pushpa 2 highlights

Devi SriPrasad pushpa 2 : అల్లు అర్జున్సు,కుమార్ కాంబినేషన్ అంటేనే అటు ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకుల్లో ఎక్కడ లేని క్రేజ్ వచ్చేస్తుంది. అలాంటిది పుష్ప సినిమాకి సీక్వెల్ అంటే ఇంకా ఆ క్రేజ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు గా. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల కలెక్షన్స్ అందుకుంటుంది అని ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అలాగే చిత్ర యూనిట్ సభ్యులు కూడా అదే దిశగా సినిమాను ప్రమోట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

డిసెంబర్ లో రాబోతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 కి త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి చిత్రాన్ని తీసుకు రావాలని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న డేట్ మిస్సవ్వకూడదని, దానితో పాటు సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చెయ్యాలని సుకుమార్ టీం ప్లానింగ్ లో వున్నారు.

సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ప్రతి సారి ఇస్తూ అది జనాల్లో వైరల్ అయ్యే విధంగా మేకర్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనియ్యం

ఇప్పుడు ఈ బాధ్యత ని చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను బయటకి చెప్పి ఫ్యాన్స్ లో మరింత అంచనాలను పెంచాడు దేవి.

ఈ సినిమా ఫస్ట్ అఫ్ తాను పాటల రచయిత చంద్రబోస్ చూసామంటూ, ఆ ఫస్టాఫ్లో ఒక మూడు బ్లాక్స్ అద్భుతంగా వచ్చాయి అని చెప్పారు.

దర్శకుడు సుకుమార్ ఈ సినిమా తో అందరిని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాడని దేవిశ్రీప్రసాద్ తనదైన శైలిలో చెప్పాడు.

Read Also : ఆ టాలెంటెడ్ దర్శకుడికి దిల్ రాజు ఛాన్స్ ఇస్తున్నాడట

అంతేకాకుండా ఇక ఐకాన్ స్టార్ బన్నీ యాక్టింగ్ అద్భుతం అని వాళ్ళిద్దరి ఇద్దరి కాంబినేషన్ మరొకసారి మ్యాజిక్ చేస్తుందని అన్నారు.

ఇక త్వరలోనే మరొక సాంగ్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. సినిమాను డిసెంబర్ 6వ తేదీన విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అంటే 5వ తారీకునే ప్రీమియర్స్ తో పుష్ప ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు

ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా చాలా భారీగా విడుదల చేయబోతున్నారు. బన్నీ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో ఈ సినిమా బిజినెస్ ఉండబోతున్నట్టు సమాచారం.

ఇక సినిమా ట్రైలర్ ను ఎప్పటి లాగే ఒక భారీ ఈవెంట్ ద్వారా విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లానింగ్ లో ఉన్నారు ముఖ్యంగా బాలీవుడ్ జనాల దృష్టిని మరింత ఆకర్షించే విధంగా ముంబైలోనే ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాలని కూడా నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Follow us on Instagram

Related posts

గ్లోబల్ స్టార్స్ తో తమన్ ధోప్ మూమెంట్.. పిక్ వైరల్

murali

రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

filmybowl

హామీ ఇస్తున్నా.. అస్సలు నిరాశ పరచను.. చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

murali

Leave a Comment