MOVIE NEWS

గ్లోబల్ వైడ్ అదరగొడుతున్న ‘దేవర’.. ఇప్పటికీ ట్రెండింగ్ లోనే..!!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ దేవర “.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూసారు. దాదాపు ఆరేళ్ళ నిరీక్షణ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా మూవీ రావడంతో ఫ్యాన్స్ దేవర సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు.. దేవర సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటించాడు..

గేమ్ ఛేంజర్ : అంజలీ పాత్రతో ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్న శంకర్..!!

దేవర సినిమా రిలీజ్ అయిన ప్రతీ చోట మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా కానీ ఎన్టీఆర్ కి గ్లోబల్ వైడ్ క్రేజ్ వున్న కారణంగా భారీ కలెక్షన్లు రాబట్టింది. దసరా కానుకగా రిలీజ్ కాబడిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం దేవర ఆశ్చర్యపరిచింది.ఎన్టీఆర్ నటన, యాక్షన్ సీన్స్ అలాగే అద్భుతమైన సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేవర విజయంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.దేవర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది.ఓటిటిలో కూడా దేవర అదరగొట్టింది…

దేవర మూవీ ఓటీటీలో కూడా ట్రెండింగులో నిలిచింది. ప్రస్తుతం ఫ్యాన్స్ లో దేవర సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.దేవర సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చినప్పటి నుండి సాలిడ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికీ కూడా నెట్‌ఫ్లిక్స్‌లో దేవర సినిమానే ట్రెండింగ్ అవుతుండడం విశేషం. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో నాన్-ఇంగ్లీష్ చిత్రాల్లో టాప్ 10లో 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది…

Related posts

గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ట్రైలర్ రిలీజ్ అప్పుడే..?

murali

డాకు మహారాజ్ : డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య.. బాబీ పనితనానికి ఫిదా అయ్యరుగా..!!

murali

అక్కడ భారీ స్థాయిలో రిలీజ్ కానున్న కల్కి.. బ్యాలన్స్ రికార్డ్స్ కూడా వదలట్లేదుగా..!!

murali

Leave a Comment